ఇటీవలి కాలంలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవలే టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించేందుకు సమ్మతించింది.
అయితే, కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయీస్‌తో తన సినిమాలోని 'హౌలి హౌలి' సాంగ్‌కు రకుల్ అద్భుతంగా నృత్యం చేసింది. ఈ పాటలో వీరిద్దరి డాన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అకీవ్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.