Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్పులు తగ్గట్టు నన్ను నేను మలుచుకుంటున్నాను : రాజేంద్ర ప్రసాద్‌

Rajendrprasad, gowtami- annauy
, శనివారం, 14 అక్టోబరు 2023 (17:35 IST)
Rajendrprasad, gowtami- annauy
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.  

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. అన్ని జనరేషన్స్ కి అడ్జెస్ట్ అవ్వడం, అన్ని జనరేషన్స్ తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడు సినిమా ఇంటికి వచ్చేసింది. నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలౌతున్నాయి. ఈ మార్పులు తగ్గట్టు కూడా నన్ను నేను మలుచుకుంటున్నాను. నేను నటించిన ఓటీటీ సినిమా 'సేనాపతి'కి ముంబైలో బెస్ట్ పెర్ ఫార్మర్ అఫ్ ది ఇయర్ అవార్డ్ వచ్చింది. ఓటీటీ సినిమాలకి మంచి కంటెంట్ వుండితీరాల్సిందే. మంచి కంటెంట్ లేకపోతే వెంటనే ఛానల్ మార్చేస్తారు ఆడియన్స్.కృష్ణారామా చాలా ప్రత్యేకమైన చిత్రం. రాజ్ గారు కథ చెప్పినపుడు చాలా సర్ ప్రైజింగ్ గా అనిపించింది. ఇప్పటి జనరేష్ కి తగిన కథ ఇది. సోషల్ మీడియా నేపధ్యంలో ఒక రిటైర్డ్  ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే అద్భుతమైన కథ ఇది. కృష్ణారామా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా కథలో భాగం అవుతారనే నమ్మకం వుంది. అంత నిజాయితీ కూడుకున్న కథ ఇది. రాజ్ గారు నటీనటుల ఎంపిక చాలా చక్కగా చేశారు. గౌతమీ, నేను ఈ పాత్రలు పోషించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాము. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా ప్రసారం అవుతుంది. పండగ చేసుకుంటూ ఇంట్లో ఈ సినిమా చూసి మా ఫ్యామిలీలో మీరంతా భాగస్వామ్యం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అనన్య శర్మ మాట్లాడుతూ.. ఇది నా మొదటి ఫీచర్ ఫిల్మ్.  #కృష్ణారామా కథ మన నిజ జీవితంలో వుంటుంది. అమ్మమ్మ తాతయ్యల కథ ఇది. ఇంత మంచి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా వుంది. రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి గారితో పని చేయడం చాలా అనందంగా వుంది. ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా చూడండి'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగవంత్ కేసరి చాలా ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా అవుతుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి