Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

Advertiesment
Rajiv Kanakala, Anish, Janvika Kalakeri etc.

చిత్రాసేన్

, బుధవారం, 22 అక్టోబరు 2025 (17:07 IST)
Rajiv Kanakala, Anish, Janvika Kalakeri etc.
కొడుకునే కూతురుగా చూసుకున వైవిధ్యమైన పాయింట్ తో రాజీవ్ కనకాల తండ్రి పాత్ర పోషిస్తున్న చిత్రం లవ్ఓటీపి. అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు లవ్ ఓటీపీ కి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌ను చేశాను. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేసేలా, పగలబడి నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. భావప్రీత బ్యానర్ మీద విజయ్ ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించారు. ఆనంద్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. నాట్య రంగ అద్భుతమైన నటుడు. బాబా భాస్కర్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. అనీష్ ఈ మూవీని ఇష్టపడి, కష్టపడి చేశాడు. రాజమౌళిలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టున్న అనీష్‌కు మంచి పేరు రావాలి. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా
హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ .. ‘హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచీ కలలు కంటుండేవాడిని. అదే విషయాన్ని మా నాన్న గారికి చెప్పాను. ఆయన సాయంతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను. వైజాగ్ మూర్తి వద్ద యాక్టింగ్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్‌తో కలిసి షెడ్డులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. ‘నెలవంక’ మూవీ ఓపెనింగ్స్‌కి బన్నీ కూడా గెస్టుగా వచ్చారు. అయితే ప్రొడక్షన్‌లోకి వద్దు అని బన్నీ సలహా ఇచ్చినా నేను వినలేదు. ఆ మూవీ తరువాత నేను కన్నడకు వెళ్లిపోయాను. గౌతమ్ తిన్ననూరి కూడా మంచి స్నేహితుడు. ‘మళ్లీ రావా’ కూడా మిస్ అయింది. ఎప్పటి నుంచో మళ్లీ తెలుగులోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాను. మళ్లీ ఇప్పుడు ఇలా ఇన్నేళ్లకు టెక్నీషియన్‌గా, దర్శకుడిగా, హీరోగా ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఇందులో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ రోజు అదే మా ఈవెంట్‌కు గెస్ట్. మేం కంటెంట్‌ను నమ్మి ఈ మూవీని చేశాం. అందుకే పది రోజుల ముందే మీడియాకు ఈ మూవీని చూపించాలని అనుకున్నాం. విజయ్ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాజీవ్ కనకాల గారు ఈ మూవీని భుజానికెత్తుకుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
నిర్మాత విజయ్ ఎం రెడ్డి మాట్లాడుతూ .. ‘అనీష్‌తో నాకు పదహారేళ్ల నుంచి బంధం ఉంది. సినిమా చేయాలని హైదరాబాద్‌కు వచ్చాం. ఇప్పుడు నేను నిర్మాతగా అనీష్‌ని హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. అనీష్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. కష్టపడుతూ ఉంటే ఫలితం దాటంతట అదే వస్తుంది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీని షూట్ చేశాం. రాజీవ్ కనకాల గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నవంబర్ 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
హీరోయిన్ జాన్విక మాట్లాడుతూ .. ‘తెలుగులో ఇదే నాకు మొదటి చిత్రం. తెలుగు ఆడియెన్స్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్ గారికి, హీరో, దర్శకుడు అనీష్ గారికి థాంక్స్. షూటింగ్ అంతా సరదాగా చేశాం. రాజీవ్ కనకాల గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Raviteja : పాటకు రిథమ్ లేదు, అర్థంలేదు.. మౌత్ టాకే... సూపర్ డూపర్‌ అంటున్న మాస్ జాతర