బాహుబలి భారతమైతే.. రజనీ 2.0 రామాయణం: పది పాత్రల్లో అక్షయ్
రహస్యాన్ని మెయిన్‌టెయిన్ చేయడంలో ఎస్.ఎస్. రాజమౌళిని మించినవారు లేరని బాహుబలి సినిమాతో సినీ జీవులకు అర్థమైపోయింది. కానీ రజనీకాంత్, శంకర్ ద్వయం తీస్తున్న 2.0 చిత్రం రహస్య చిత్రీకరణ విషయంలో బాహుబలినే మించిపోయినట్లుంది.
రహస్యాన్ని మెయిన్‌టెయిన్ చేయడంలో ఎస్.ఎస్. రాజమౌళిని మించినవారు లేరని బాహుబలి సినిమాతో సినీ జీవులకు అర్థమైపోయింది. కానీ రజనీకాంత్, శంకర్ ద్వయం తీస్తున్న 2.0 చిత్రం రహస్య చిత్రీకరణ విషయంలో బాహుబలినే మించిపోయినట్లుంది. రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామాయణం ఆధారంగా ఒక ఊహాజనిత సాంకేతిక మంత్ర జగత్తును శంకర్ నిర్మించినట్లు చాలా ఆలస్యంగా బయటపడింది. ఈ ఒక్క స్కూప్ వార్తతో 2.0 సినిమాపై అంచనాలు ఆకాశానికి ఎగిరాయి.
రోబో సీక్వెల్‌ను పోలిన సైన్స్ ఫిక్షన్ అంశంగా దక్షిణాది అగ్రహీరో శంకర్ 2.0ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర హీరో రజనీకాంత్ మరుగుజ్జు పాత్రలో నటించారని, రావణుడిని పోలిన పాత్రలో అక్షయ్ కుమార్ మొత్తం పది పాత్రల్లో కనిపిస్తారని, ఇక రజనీ సైంటిస్ట్ వశీకరణ్, రోబో చిట్టి పాత్రలతో పాటు మరో మూడు పాత్రల్లో నటిస్తున్నారని తాజాగా తెలిసింది. ఇక సాంకేతికంగా చూస్తే 2డి, 3డి, ఐమాక్స్ 3డి, ఐమాక్స్ రియల్ 3డి ఫార్మాట్లలో డాల్బీ అట్మాస్ కంటే ఉత్తమమైన సౌండ్ టెక్నాలజీతో ‘2.0’ను దర్శకుడు శంకర్ తీర్చి దిద్దుతున్న విషయం తెలిసిందే.
మహాభారతంలోని ఉపకథలు ఇతివృత్తంగా రాజమౌళి ఇప్పటికే తీసిన బాహుబలి 1, 2 భాగాలు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కొత్త సంచలనం సృష్టించింది. మన కళ్లముందు మాహిష్మతి రాజ్యం పేరుతో ఒక మంత్ర జగత్తును సృష్టించిన రాజమౌళి ఒక్కసారిగా ప్రపంచ స్థాయి డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న బాహుబలి ది కన్‌క్లూడింగ్ భారతీయ చిత్ర సాంకేతిక నాణ్యతను శిఖర స్థాయికి తీసుకుపోనున్నదని భావిస్తున్నారు.
బాలివుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ అయితే 60 సంవత్సరాల క్రితం వచ్చిన ముఘల్ ఇ అజమ్ చిత్రం తర్వాత ఆ స్థాయిని తలపించిన చిత్రంగా బాహుహలిని పొగిడేశారు. ఇక రామాయణ ఇతివృత్తంతో శంకర్ తీస్తున్న 2.0 ఎంత సంచలనం కలిగించనుందో మాటలకందదు. 2017 సంవత్సరం భారతీయ చలన చిత్ర గౌరవాన్ని గ్లోబల్ స్థాయిలో నిలపనుంది.