Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవంతిక పాత్ర రాజమౌళి ఇచ్చాడు.. మిగతావాళ్లకు ఆ గట్స్ ఏవీ: తమన్నా విచారం

పదేళ్లకు పైగా సినిమా జీవితం ఆమెది. ఈ పదేళ్లూ పాలనురుగు వంటి తన మేని అందాలను చూపించిన చోటే చూపిస్తూ డబ్బు చేసుకుంటోంది చిత్రపరిశ్రమ. దక్షిణాది సినిమాల్లో ఆమె శరీరాన్ని సొమ్ము చేసుకున్నట్లుగా మరే హీరోయి

అవంతిక పాత్ర రాజమౌళి ఇచ్చాడు.. మిగతావాళ్లకు ఆ గట్స్ ఏవీ: తమన్నా విచారం
హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (05:22 IST)
ఫదేళ్లకు పైగా సినిమా జీవితం ఆమెది. ఈ పదేళ్లూ పాలనురుగు వంటి తన మేని అందాలను చూపించిన చోటే చూపిస్తూ డబ్బు చేసుకుంటోంది చిత్రపరిశ్రమ. దక్షిణాది సినిమాల్లో ఆమె శరీరాన్ని సొమ్ము చేసుకున్నట్లుగా మరే హీరోయిన్ విషయంలోనూ జరగలేదు. కోట్లు గుమ్మరించి నిర్మాతలూ, దర్శకులూ ఆమెచేత సైన్ చేయించుకుంటున్నది తన శరీరంలోని అణువణువునూ ఏదో ఒక ప్రత్యేకమైన యాంగిల్‌లో చూపి కాసులు రాబట్టుకోవడానికే అన్నది జగమెరిగిన సత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె దక్షిణాది గ్లామర్ క్వీన్. తన గ్లామర్‍‌ను చూసి తనకే బోర్ కలుగుతున్నా నిర్మాతల, దర్శకుల ఆబతనం నుంచి ఆమె బయట పడలేక అందాల ఆరబోతతోనే జీవితం గడిపేస్తున్నారు.
 
కానీ బాహుబలి సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. అవంతిక పాత్ర ప్రేక్షకులలో గిలిగింతలు పెట్టించింది. గ్లామర్‌తో కాదు. చిత్ర దర్శకుడు రాజమౌళి, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అవంతిక పాత్రను తీర్చిదిద్దిన వైనం వారికే ఆశ్చర్యం కలిగించేంత గొప్ప నటనను ఆమె నుంచి రాబట్టింది. బాహుబలి తొలి భాగంలో ఊహించనంత మంచి నటన ప్రదర్శించింది అవంతికే అంటూ విజయంద్ర ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడంటే ఆ చిత్రంలో ఆమె పాత్ర ధీరత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 
 
అందుకే తనను గ్లామర్ కా రాణీ అనే ఇమేజ్ నుంచి తప్పించి తనకూ నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఇవ్వాల్సిందిగా ఆమె ఇప్పుడు నిర్మాతలను, దర్శకులను ఒత్తిడి పెడుతున్నారట. రియల్ లైఫ్‌లో సంసారపక్షంగా ఉండే తనను రీల్ లైఫ్ లోనే కురుచ దుస్తులతో చూపించి తన ఇమేజ్‌కు భంగం కలిగేలా చేస్తున్నారని ఆమె వాపోతున్నారు. బాహుబలి చిత్రంలో అందాలతోపాటు అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తమన్నా భవిష్యత్తులోనైనా ఆ తరహా శక్తివంతమైన పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారట.
 
ఏప్రిల్ 28న విడుదల అవుతున్న బాహుబలి-2 లో వీరనారిగా తమన్నా పాత్రను చూసైనా ఆమెపట్ల చిత్ర ప్రపంచం తన అబిప్రాయాన్ని మార్చుకుంటుందా? అయినా తమన్నా లోని అప్సరసను, వీరత్వాన్ని సమపాళ్లలో చూపించి భళీ  అనిపించుకున్న రాజమౌళి ధీరత్వం మిగతా దర్శకుల్లో ఏదీ మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నక్కను తొక్కిన అమలాపాల్.. టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్