Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి కంటే సెక్సీ నువ్వేనయ్యా అన్న వర్మ: అయ్యా నన్నొగ్గేయండయ్యా అని అడుక్కున్న రాజమౌళి

వివాదాస్పద ట్వీట్లకు మారుపేరు రాంగోపాల్ వర్మ అన్నది జగమెరిగిన సత్యం. తన ట్వీట్లతో సెలబ్రిటీలకు చిరాకు తెప్పించడం, తర్వాత తానే చిక్కుల్లో ఇరుక్కోవడం వర్మ స్టయిల్. ఇప్పుడు బాహుబలి క్రేజీ ప్రపంచవ్యాప్తంగా ప్రబలిపోవడంతో వర్మ తాజాగా రాజమౌళి మీద పడ్డాడు.

Advertiesment
బాహుబలి కంటే సెక్సీ నువ్వేనయ్యా అన్న వర్మ: అయ్యా నన్నొగ్గేయండయ్యా అని అడుక్కున్న రాజమౌళి
హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:31 IST)
వివాదాస్పద ట్వీట్లకు మారుపేరు రాంగోపాల్ వర్మ అన్నది జగమెరిగిన సత్యం. తన ట్వీట్లతో సెలబ్రిటీలకు చిరాకు తెప్పించడం, తర్వాత తానే చిక్కుల్లో ఇరుక్కోవడం వర్మ స్టయిల్. ఇప్పుడు బాహుబలి క్రేజీ ప్రపంచవ్యాప్తంగా ప్రబలిపోవడంతో వర్మ తాజాగా రాజమౌళి మీద పడ్డాడు. పడ్డం మామూలుగా తెలుగులో మహా గొప్ప దర్శకులు అని చెప్పుకుంటున్న వారందరూ రాజమౌళి కాళ్ల కింద దూరాలి అనేంతగా ప్రశంసల వర్షంలో ముంచెత్తేశాడు వర్మ. ఇది పాత విషయం, కాని కొత్త విషయం మరొకటుంది. 
 
తాను ఇటీవల రాజమౌళితో దిగిన ఫోటోను తాజాగా సోమవారం ఉదయం షేర్ చేసిన వర్మ..దానికి కామెంట్ ఏం జత చేశాడో తెలుసా.. బాహుబలి సినిమా కంటే రాజమౌళే మాంచి సెక్సీగా ఉన్నాడని బాంబు పేల్చేశాడు. కానీ రాజమౌళి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఏకవాక్యంతో ఇలా రీట్వీట్ చేశాడు. 
 
అయ్యా... నన్ను ఒగ్గేయండయ్యా... 
 
రాము, రాజమౌళి సంవాదం ఇప్పుడు వైరల్ అయింది. వర్మ సెటైర్‌కు రాజమౌళి ఫన్నీ కామెంటును చూసి నవ్వనోళ్ల లేరంటే మీమీద వర్మ ఒక సెక్సీ ట్వీట్ సంధించినంత ఒట్టు మరి.
 
Ram Gopal Varma ✔ @RGVzoomin
The ugly is the beastly me and @ssrajamouli is looking more sexier than the beautiful #baahubali2 pic.twitter.com5KUYgepcMu
 Follow
 
 rajamouli ss ✔ @ssrajamouli
@RGVzoomin Ayyaaa...nannu oggeyyandayyaa....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటించమంటే.. జీవిస్తారా? భర్త నటించిన "ఆ" సీన్లు చూసి బోరుమన్న హీరో భార్య