Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటించమంటే.. జీవిస్తారా? భర్త నటించిన "ఆ" సీన్లు చూసి బోరుమన్న హీరో భార్య

ఏక్తా కపూర్ టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన బాలీవుడ్ నిర్మాత. ఏక్తా కపూర్ తీసిన 'రాగిణి ఎంఎంఎస్', 'డర్టీ పిక్చర్స్' అనే చిత్రాలు ఓ రేంజ్‌లో ప్రేక్షదారణ పొందాయి. పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్క

Advertiesment
Bewafa Se Wafa
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (10:29 IST)
ఏక్తా కపూర్ టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన బాలీవుడ్ నిర్మాత. ఏక్తా కపూర్ తీసిన 'రాగిణి ఎంఎంఎస్', 'డర్టీ పిక్చర్స్' అనే చిత్రాలు ఓ రేంజ్‌లో ప్రేక్షదారణ పొందాయి. పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు... కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి. ఈ నేపథ్యంలో నటుడు సమీర్ సోనీ నటి డిపాంటియా శర్మలు ప్రధాన పాత్రల్లో బాలాజీ మోషన్ పిక్చర్స్ బేనర్ మీద ‘బేవఫా సి వాఫా’ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. 
 
ఈ వెబ్ సిరీస్ వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో భాగంగా హీరోయిన్లిద్దరితోనూ మాంచి ఇంటిమేట్ సీన్లు చేశాడట సమీర్. అయితే సమీర్ ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ముందు నుంచి అతడి భార్య నీలంకు తెలిసినప్పటికీ అతను చేసిన సెక్స్ సీన్లలో డోస్ ఆ స్థాయిలో ఉంటుందని ఆమె ఊహించలేదట. 
 
కానీ, ఇటీవల భర్త నటించిన సన్నివేశాలు చూసి ఆమె షాక్ తిందట. ట్రైలర్ చూడగానే ఆమె తీవ్ర ఆవేదనకు గురైందట. ఈ విషయమై భర్తతో ఆమె గొడవ పెట్టేసుకుందట. దీంతో వెబ్ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని ఏక్తా కపూర్‌ను అడగ్గా సాధ్యం కాదని చెప్పేశారట. ఆల్రెడీ షో రన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోతలేమీ పెట్టడానికి లేదని, ఇవన్నీ ముందు ఆలోచించుకోవాల్సిందని ఆమె స్పష్టం చేసిందట. దీంతో సమీర్ భార్యకు ఎలా సర్దిచెప్పాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య నెత్తిపై భర్త ఎందుకు నీళ్లు చల్లుతాడు..