Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భజరంగీ భాయ్‌జాన్‌ను చేతులారా కోల్పోయిన రాజమౌళి.. లక్కుండాలి మరి

తెలుగు సినీ రచయితల్లో విజయేంద్ర ప్రసాద్‌ది ఒక విలక్షణ శైలి. కథ చెబుతున్నప్పుడే సినిమా మన కళ్లముందు కదులాడేంత సమర్థవంతంగా కథను వర్ణించడంలో ఆయనకు సాటి మరెవ్వరూ ఉండరు. కథా బలంతోనే సినిమాను ఎలా విజయవంతం చేయవచ్చో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలీదంటే అతిశయో

Advertiesment
భజరంగీ భాయ్‌జాన్‌ను చేతులారా కోల్పోయిన రాజమౌళి.. లక్కుండాలి మరి
హైదరాబాద్ , ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:55 IST)
తెలుగు సినీ రచయితల్లో విజయేంద్ర ప్రసాద్‌ది ఒక విలక్షణ శైలి. కథ చెబుతున్నప్పుడే సినిమా మన కళ్లముందు కదులాడేంత సమర్థవంతంగా కథను వర్ణించడంలో ఆయనకు సాటి మరెవ్వరూ ఉండరు. కథా బలంతోనే సినిమాను ఎలా విజయవంతం చేయవచ్చో ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలీదంటే అతిశయోక్తి కాదు. ఆయన కథను ఎంత బలంగా అల్లుకుంటాడో తెలిసిన తనయుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం ఒక్క క్షణం ఏమరపాటుకు గురైన క్షణంలో ఒక అద్భుతమైన సినిమాను చేతులారా పోగొట్టుకున్నాడు. అదే బాలీవుడ్‌లో అద్భుతం సృష్టించిన భజరంగీ భాయ్‌జాన్.

రాజమౌళి వద్దనుకున్న తర్వాతే ఆ సినిమాను విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి ఇచ్చేశారట. బజరంగీ భాయ్‌జాన్‌ కథ మీ కాంపౌండ్‌ దాటి ఎందుకు బయటకు వెళ్లిపోయింది అన్న ప్రశ్నకు చాలా మామూలుగా, అదేదో సరదా విషయంలాగా విజయేంద్ర ప్రసాద్ సమాధానం చెప్పారు.
 
సల్మాన్‌ ఖాన్‌ కథ అడిగినప్పుడు ‘నా దగ్గర ఓ మంచి కథ ఉంది, చేస్తావా లేదంటే సల్మాన్‌కి ఇచ్చేయనా’ అని రాజమౌళిని అడిగా. ‘ఇచ్చేయండి’ అన్నాడు. ‘బజరంగీ భాయ్‌జాన్‌’ విడుదలైన తరవాత.. ‘మీరు అడిగినప్పుడు నేను కొంచెం పని ఒత్తిడిలో ఉన్నాను. పదిహేను రోజుల ముందు గానీ, పదిహేను రోజుల తరవాత గానీ అడిగి ఉంటే కచ్చితంగా చేసేవాడ్ని’ అన్నాడు. ఆ క్షణంలోనే సల్మాన్ ఖాన్‌కి లడ్డూలాంటి కథ చిక్కడం, దేశవిదేశాల్లో అది సంచలనం కలిగించడం అందరికీ తెలిసిందే. 
 
దీన్ని బట్టి తెలుస్తున్నదేమిటంటే.. రాజమౌళి వంటి సూపర్ దర్శకుడు కూడా కథను అంచనా వేయడంలో పొరపాటు చేస్తాడన్నమాట. అదీ తండ్రి కథ విషయంలోనే రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టప్ప ఊహ నుంచే బాహుబలికి బీజం పడిందా? అవునంటున్న బాహుబలి రచయిత