Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంధు ప్రీతిపై ఒరేయ్‌ బుజ్జిగా ఏమన్నాడంటే..?

Advertiesment
బంధు ప్రీతిపై ఒరేయ్‌ బుజ్జిగా ఏమన్నాడంటే..?
, శుక్రవారం, 2 అక్టోబరు 2020 (16:49 IST)
rajtarun
యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ బంధు ప్రీతి గురించి తాజాగా స్పందించారు. బయట నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వ్యక్తిని అయినప్పటికీ బంధుప్రీతి కారణంగా ఇప్పటివరకూ తాను ఎలాంటి ఆఫర్స్‌ కోల్పోలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడాలని మాత్రం తనకు అర్థమైంది. 
 
తెలుగు సినీ పరిశ్రమ టాలెంట్‌కు పెద్దపీట వేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కాబట్టి టాలెంట్‌ ఉంటే తప్పకుండా ఎవరైనా ఇక్కడ రాణించగలరని రాజ్‌ తరుణ్‌ తెలిపారు. కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు నుంచే దర్శకుడిగా రాణించాలనే కల ఉండేది. కథలు రాయడమంటే తనకెంతో ఇష్టం. అలా రాసిన ప్రతిసారీ తప్పకుండా ఓ రోజు ఆ కథలతో సినిమా చేయాలనుకునేవాడిని అని తెలిపాడు. 
 
కానీ ప్రస్తుతానికి తన దృష్టంతా నటన మీదే ఉంది. 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌ కుమార్‌ కొండా టాలెంట్‌ ఉన్న వ్యక్తి. ఆయనతో తనకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తామిద్దరం కలిసి మరో సినిమా కోసం పనిచేస్తున్నాం. ప్రస్తుతం దాని షూటింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఓ నూతన దర్శకుడితో కలిసి పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో కథలు విన్నాను. వాటిల్లో చాలా కథలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్‌ కాగానే ప్రకటిస్తానని తెలిపాడు. 
 
కాగా, తాజాగా విడుదలైన 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రంలో రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించారు. మాళవికా నాయర్‌ కథానాయిక. హెబ్బా పటేల్‌ కీలకపాత్ర పోషించారు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'ఆహా' వేదికగా అక్టోబర్‌ 1న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జబర్దస్త్' తర్వాత నాగబాబు షో.. #BommaAdhirindi యాంకర్‌గా శ్రీముఖి..