Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

Advertiesment
Noyal, Rahul Sipliganj, Dettadi Harika, Indrasena and others

డీవీ

, శనివారం, 21 డిశెంబరు 2024 (13:45 IST)
Noyal, Rahul Sipliganj, Dettadi Harika, Indrasena and others
గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ వేడుకలో నోయెల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.
 
మ్యూజిక్ డైరెక్టర్ నోయల్ మాట్లాడుతూ.. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఇంత బాగా రావడానికి కారణం అయినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటకు పని చేసిన కెమెరా భార్గవ్ అత్యద్భుతమైన విజువల్స్ అందించారని, పాటలో స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్ సుభాష్ మాస్టర్ డాన్స్ బాగా కంపోజ్ చేశారని తెలిపారు.

ఇక ఈవెంట్ కు రాహుల్ సీట్లు గంజ్ రావడం ఎంతో ప్రత్యేకమన్నారు. తన పాటలు మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పాటల్లో యాక్ట్ చేశాను అంటే అది రాహుల్ సిప్లిగంజ్ పాటే అని గుర్తు చేసుకున్నారు. ఇక భవిష్యత్తులో కూడా రాహుల్ సిప్లిగంజ్ తో తప్ప ఏ ఒక్కరితో కొలాబరేట్ అవ్వను అన్నారు. ఈవెంట్ కు వచ్చిన మహబూబా, హారిక కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ పాట అందరికీ నచ్చుతుందని డిసెంబర్ 31, సంక్రాంతి పండుగలకు దుమ్ము రేపుతుందని తెలిపారు.
 
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. తెలుగోడి బీట్ పాట లో ఫుల్ మాస్ బీట్ ఉందని ప్రేక్షకులు కచ్చితంగా ఈ పాటని ఘనవిజయం చేస్తారని, ఈ పాట చేసిన నోయల్ కు అభినందనలు తెలిపారు. ఈ పాట ప్రతి ఒక్కరిని షేర్ చేయాలని, ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు.  ఈ సాంగ్అ న్ని వేడుకల్లో దుమ్మురేపుతది అన్నారు.
 
డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ టీమ్ హర్షడైస్, మనస్వి రాజేష్ కన్నా మాట్లాడుతూ, నా JNAFAU విద్యార్థులకు, అతిథులకు ధన్యవాదాలు. నోయెల్ తన అద్భుతమైన ప్రదర్శన ఇది. సంగీతం, నవ్వు మరియు జ్ఞాపకాలతో నిండిన రాత్రి, మేము ఎప్పటికీ ఆదరిస్తాము. మరోసారి, ఈ ఈవెంట్‌ను ఇంత ప్రత్యేకంగా చేసినందుకు మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
ఇంకా ఈ కార్యక్రమంలో దేత్తడి హారిక, సిద్దు రెడ్డి కందకట్ల, మెహబూబా, నటులు ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్