Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ 25వ సినిమా ప్రారంభం

Advertiesment
Raghava Lawrence, Ramesh Varma

డీవీ

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (16:54 IST)
Raghava Lawrence, Ramesh Varma
నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్‌. యూనివర్శిటీ ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ రాక్షసుడు, ఖిలాడీ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ. నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు కోనేరు సత్యనారాయణ.
 
తమ సంస్థలో ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో మరోసారి ప్రాజెక్ట్ చేయనున్నారు కోనేరు సత్యనారాయణ. ఈ సారి బిగ్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌కి శ్రీకారం చుట్టనున్నారు. రమేష్‌వర్మతో కోనేరు సత్యనారాయణకు ఇది హ్యాట్రిక్‌ కొలాబరేషన్‌.
 
ఇటీవల వరుస సక్సెస్‌ల మీదున్న రాఘవ లారెన్స్ ఈ తాజా సినిమాలో హీరోగా నటించనున్నారు. అత్యంత భారీ వ్యయంతో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు మేకర్స్. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం గమనార్హం. న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది ఈ ప్రాజెక్ట్. అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ మీద షాడో అవతార్‌లో రాఘవ లారెన్స్ ఇమేజ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎగ్జయిట్‌మెంట్‌ వర్డ్స్ ప్రాజెక్టుకు ఇన్‌స్టంట్‌గా హైప్‌ పెంచుతున్నాయి. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీటర్ హెయిన్ మాస్టర్ సూపర్ విజన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ఎపిసోడ్