Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‍డౌన్‌లో కేకపుట్టిన రాధికా ఆప్టే... జానాబెత్తెడు బికినీలో అందాల ఆరబోత

Advertiesment
లాక్‍డౌన్‌లో కేకపుట్టిన రాధికా ఆప్టే... జానాబెత్తెడు బికినీలో అందాల ఆరబోత
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:13 IST)
బాలీవుడ్‌లో బోల్డ్ నటిగా గుర్తింపు పొందిన రాధికా ఆప్టే. ఇటు తెలుగు, అటు తమిళ సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అయితే, ఈ అమ్మడు లాక్‌డౌన్ సమయంలో అందాలను ఇష్టానుసారంగా ఆరబోస్తోంది. ముఖ్యంగా జానాబెత్తెడు బికినీని ధరించి రచ్చరచ్చ చేస్తోంది. లాక్‌డౌన్ వేళ అత అందాల సోయగాలతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. 
 
కరోనా వైరస్ పుణ్యమాని ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ముఖ్యంగా, పలువురు సెలెబ్రిటీలు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, రాధికా ఆప్టే మాత్రం లండన్‌లో ఉంటోంది. అక్కడ ఓ సముద్రతీర ప్రాంతంలో హాయిగా సేదతీరుతోంది. ఒక వైపు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే.. ఆమె మాత్రం ఈ ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ, ఎంజాయ్ చేస్తోంది. 
 
తాజాగా ఆమె సముద్ర తీరంలో బికినీలో కనిపించింది. లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఓ హాట్ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. "No corona in the ocean, Socially distant diving desire" అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేసింది. 
 
అమ్మడు పోస్ట్ చేసిన ఈ పిక్ వైరల్‌గా మారింది. ఏం హాట్ గురూ అని కొందరు, చాలా సెక్సీగా ఉన్నావని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, తన క్షేమం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులను ఉద్దేశించి గతంలో రాధిక ఆప్టే ఓ పోస్టు పెట్టింది. 'నేను లండన్‌లో ఉన్నాను. క్షేమంగానే ఉన్నాను. నా గురించి ఆందోళన పడొద్దు' అనే పోస్ట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Loving the locked down


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ టు చెన్నై - 650 కిమీ ఒంటరిగా బైక్‌పై వెళ్లిన హీరో....