Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరి - విజ‌య్ సినిమా ఉన్నట్టా..? లేన‌ట్టా..?

Advertiesment
పూరి - విజ‌య్ సినిమా ఉన్నట్టా..? లేన‌ట్టా..?
, బుధవారం, 24 జులై 2019 (22:48 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌తో తీసిన‌ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో పూరితో సినిమాలు చేసేందుకు హీరోలు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ సినిమాని పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయాల‌నుకున్నార‌ని.. కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. 
 
పూరి నెక్ట్స్ మూవీ మాత్రం విజ‌య్‌తోనే అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రూ క‌లిస్తే.. ఇక ఆ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలాఉంటే.. విజ‌య్ లేటెస్ట్ మూవీ డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన విజ‌య్‌ని పూరితో సినిమా అని వార్త‌లు వ‌స్తున్నాయి నిజ‌మేనా..? అని అడిగితే... అస‌లు ఆ ఆలోచ‌నే లేదు అని చెప్పాడు. 
 
విజ‌య్ చెప్పిన స‌మాధానం బ‌ట్టి పూరితో సినిమా లేద‌ని తెలిసింది కానీ.. మ‌జిలీ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌కి ఇవ్వాల‌నుకున్న డేట్స్ కూడా ప‌క్క‌న పెట్టి విజ‌య్ పూరితో సినిమా చేయాల‌నుకుంటున్నాడు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజ‌య్ పూరితో సినిమా లేదంటున్నాడు కానీ.. వీరిద్ద‌రి సినిమా గురించి వార్త‌లు మాత్రం వ‌స్తూనే ఉన్నాయి. మ‌రి... ఈ వార్త‌లపై పూరి స్పందిస్తాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ రెండో రోజే మొద‌లెట్టేసారుగా.. ఇక ముందు ముందు ఎలా ఉంటుందో..?(Video)