Psycho varma lyrical song promo
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ ఓ పాట పాడాడు. కరోనాకాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల పరంపర ఓ రేంజ్‌లో సాగుతోంది. ఒక పక్క సినిమా మీద సినిమా చేస్తూ ఆర్జీవీ బిజీగా ఉంటే, అతనిపై సెటైరికల్ సినిమాలు కూడా అంతే రేంజ్‌లో ఒకదాని వెనుక ఒకటి తెరకెక్కుతున్నాయి. ఆ కోవలోకి చెందినదే 'సైకో వర్మ' ట్యాగ్ లైన్ 'వీడు తేడా'. ఈ సినిమాని నట్టి కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో ఓ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడుతూ ఉన్న ఓ గ్లింప్స్ లాంటిది కూడా వదిలారు. అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 'పిచ్చోడి చేతిలో రాయి.. పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయ్' అంటూ రాహుల్ ఆలపించిన పాట ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను సెప్టెంబర్ 1 ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు.