Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖైదీలో నా సీన్స్ కట్.. సంక్రాంతి రోజున అమ్మ చనిపోయినంత బాధగా ఉంది: పృథ్వీ

పృథ్వీ టాలీవుడ్ ప్రేక్షకులు బాగా పరిచయమైన వ్యక్తి. కమేడియన్. క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా. నందమూరి బాలకృష్ణ‌ను అనుకరిస్తూ పృథ్వీ చేసే యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పక తప్పదు. అయితే ఆ తర్వాత బ

ఖైదీలో నా సీన్స్ కట్.. సంక్రాంతి రోజున అమ్మ చనిపోయినంత బాధగా ఉంది: పృథ్వీ
, గురువారం, 5 జనవరి 2017 (09:46 IST)
పృథ్వీ టాలీవుడ్ ప్రేక్షకులు బాగా పరిచయమైన వ్యక్తి. కమేడియన్. క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా. నందమూరి బాలకృష్ణ‌ను అనుకరిస్తూ పృథ్వీ చేసే యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పక తప్పదు. అయితే ఆ తర్వాత బాలకృష్ణ అభిమానులు పృథ్వీకి వార్నింగ్ ఇవ్వడంతో బాలకృష్ణను ఇమిటేట్ చేయనని పృథ్వీ ప్రకటించాడు. 
 
ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ అప్‌డేట్స్ ఇస్తూ ఉండే పృథ్వీ ఒక్క పోస్ట్‌తో మరో సంచలనానికి తెరలేపాడు. ‘‘మెగాస్టార్ గారి 150వ మూవీలో నటించడం నా అదృష్టం. సీన్స్ తీసివేయడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున మా మదర్ చనిపోయినంత బాధగా ఉంది’’. అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా అవాక్కయ్యారు. పృథ్వీ ఎందుకింత ఎమోషనల్ అయ్యాడో ఎవరికీ అర్థం కాలేదని మాట్లాడుకున్నారు. 
 
సినిమాలో సీన్స్‌కు, తల్లి చావుకు ముడిపెట్టడమేంటని పృథ్వీపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టడంపై పృథ్వీ స్పందించాడు. ఖైదీ నెం.150 సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా చాలనుకున్నానని, అలాంటిది మంచి పాత్ర దొరకడంతో ఎంతో సంతోషపడ్డానని వెల్లడించాడు. కానీ తాను నటించిన సీన్స్ తీసేయడంతో చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు. 
 
తాను ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి సినిమాలే కారణమని పృథ్వీ వెల్లడించాడు. అలాంటి హీరో సినిమాలో నటించిన సీన్‌ను తొలగించడం పెద్ద షాక్ అని చెప్పాడు. అయితే ఈ పోస్టులను పృథ్వీ కొన్ని గంటల్లో ఫేస్ బుక్ నుంచి తొలగించాడు. ఇందుకు కారణం.. బ్రహ్మానందం నటించిన 18 సీన్లని ఎలివేట్ చేశారని, ఆ కారణంగానే పృధ్వీ సీన్స్‌ని తొలగించారంటూ ఫిల్మ్‌నగర్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’... కంటతడి పెట్టిస్తున్న ఖైదీ చిత్రంలోని పాట!