Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’... కంటతడి పెట్టిస్తున్న ఖైదీ చిత్రంలోని పాట!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించి మరో పాటను యూట్యూబ్‌లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాలు.. కడగండ్ల నేపథ్యంలో చిత్రీకరించిన ‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’

Advertiesment
Khaidi No.150
, గురువారం, 5 జనవరి 2017 (09:41 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించి మరో పాటను యూట్యూబ్‌లో బుధవారం విడుదల చేశారు. రైతుల కష్టాలు.. కడగండ్ల నేపథ్యంలో చిత్రీకరించిన ‘నీరు..నీరు.. రైతుకంట నీరుచూడనైన చూడరెవ్వరూ..’ అంటూ సాగే ఈ పాట అన్నదాతలనే కాదు, ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉంది. 
 
ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇంతకుముందు విడుదల చేసిన పాటలకు, ముఖ్యంగా ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ అనే పాటకు భారీ స్పందన వచ్చింది. ఆ తర్వాత రత్తాలు అనే ఐటమ్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే, ఆరు పదుల వయసులో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటే గంతులేయడం ఏమిటంటూ అనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు ఈ తాజా పాట చెక్ పెట్టింది. 

 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆంధ్రా రేటు అదిరిపోయింది... బాలకృష్ణ దూకుడే దూకుడు...