నట్టి కుమార్ సంచలన ప్రకటన... నయీంతో ప్రొడ్యూసర్స్‌కి లింకులు... చంద్రబాబు మాట్లాడరేం...?
మాఫియా డాన్ నయీంతో తెలుగు ఇండస్ట్రీలో సి.కళ్యాణ్, బూరుగుపల్లి శివరాకృష్ణ, నిర్మాత, నటుడు అశోక్ కుమార్, బాలీవుడ్‌లో గుట్కా వ్యాపారవేత్త కొడుకు, నటుడు, నిర్మాత 'పండుగాడు' హీరో సచిన్ జోషికి సంబంధాలున్నాయని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు.
మాఫియా డాన్ నయీంతో తెలుగు ఇండస్ట్రీలో సి.కళ్యాణ్, బూరుగుపల్లి శివరాకృష్ణ, నిర్మాత, నటుడు అశోక్ కుమార్, బాలీవుడ్‌లో గుట్కా వ్యాపారవేత్త కొడుకు, నటుడు, నిర్మాత 'పండుగాడు' హీరో సచిన్ జోషికి సంబంధాలున్నాయని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంలో ఈ విషయాలను వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాలు....
1. సచిన్ జోషి.. నిర్మాతగా ఓ సినిమాను చేయమని బండ్ల గణేష్‌కు అప్పగిస్తే మోసం చేశాడు. అప్పుడు నయీంను జోషి ఆశ్రయించి.. బండ్ల గణేష్ నుంచి డబ్బు రాబట్టుకున్నాడు.
2. తెలంగాణాలో కెసిఆర్ పెద్ద ఆపరేషన్ చేసి మాఫియా డాన్‌ను తుదముట్టించడం అభినందనీయం. అదే నయీంను పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే.. ఆయన ఏమీ మాట్లాడకపోవడం విశేషం.
3. తెదేపాకు చెందిన ఓ ఎంపికి కూడా నయీంతో సంబంధాలున్నాయి.
అందుకు ఉదాహరణ.. నాకు అచ్చంపేటలో థియేటర్ వుంటే చిన్న వివాదంలో వుంటే కోట్ల థియేటర్‌ను లక్షల్లో సర్దుబాటు చేయించారు. నయీం మనుషులు వస్తే ఆయన వారికి సపోర్ట్ ఇచ్చారు. నేను చాలా నష్టపోయాను.. మరి చంద్రబాబు ఈ విషయంలో ఏమీ నోరుమెదపడంలేదు. పోలీసులను ఆశ్రయిస్తే.. ఇది సివిల్ కేసు మేము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.
4. హైదరాబాద్‌లోని థియేటర్లలో నయీం మనుషులు క్యాంటిన్లు నడుపుతున్నారు.
5. ఇంకా చాలామంది ఇండస్ట్రీలో నయీం చేత పనులు చేయించుకున్నారు. పరోక్షంగా పెట్టుబడులు పెట్టారు అని నట్టి కుమార్ చెప్పారు.
మరి వీటికి ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తే..
ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు బయటపెడతాను. నేను చెప్పింది ప్రతిదీ సత్యమే. కాదు అంటే నాపై కేసు వేసుకోమనండి.. అని నట్టికుమార్ సవాల్ విసిరారు.
గతంలో సి.కళ్యాణ్‌కు.. మద్దెల సూరి, భానుకు సంబంధాలున్నాయని చెప్పాను. అది వాస్తవమా...? కాదా? మీరే చెప్పండి.. అంటూ విలేకరులను ప్రశ్నించారు.
ఏదిఏమైనా... ఇలాంటి దందాలు.. అల్లు అరవింద్ వంటివారు చేయరనీ.. పద్ధతి ప్రకారం వారు సినిమాలు తీస్తారని.. నట్టి కుమార్ చెప్పడం విశేషం.