Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్లామర్ పాత్రలు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు : ప్రియాంకా అరుల్ మోహన్

Advertiesment
Priyanka Arul Mohan
, సోమవారం, 22 మార్చి 2021 (14:49 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంకా అరుల్‌ మోహన్‌. అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే ఈ మనోహరిది కన్నడ సీమ. అమాయకపు చూపులు, అందమైన అభినయంతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. 
 
ఇండస్ట్రీలోకి వచ్చిన మూడేండ్లలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులందరికీ పరిచయమైంది. తాజాగా శర్వానంద్‌ ‘శ్రీకారం’తో మరోసారి తెలుగు లోగిళ్లలో సందడి చేస్తోంది. 
 
ఆమె తాజాగా మాట్లాడుతూ, ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా కథలు నచ్చక అంగీకరించలేదు. ‘శ్రీకారం’ కథ బాగుండటంతో ఓకే చెప్పా. తమిళంలో శివకార్తికేయన్‌ సినిమాతోపాటు మరో సినిమా చేస్తున్నా. నా సినిమాలు చూసి చాలామంది, నేను గ్లామర్‌ పాత్రలు చేయనని అనుకుంటున్నారు. 
 
నిజానికి అలాంటి పాత్రల్లో కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే, గ్లామర్‌ అంటే చాలీచాలని దుస్తులు వేసుకోవడం కాదు. ఎవరికీ ఇబ్బంది లేకుండా అందంగా కనిపించడం. సినిమా అంటే కుటుంబంతో కలిసి చూడగలగాలి. సంప్రదాయమైన గ్లామర్‌కే నా ఓటు. 
 
టాలీవుడ్‌లో నాగార్జున, రానా, కోలీవుడ్‌లో అనికా సురేంద్రన్‌, ఐశ్వర్య శర్మల నటన అంటే చాలా ఇష్టం. నేను ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు వీళ్లు. స్వతంత్రంగా ఉండాలనుకొంటాను. అందుకే నచ్చని కథల్ని తిరస్కరిస్తూ, నచ్చినవే చేస్తున్నా. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించాలన్నదే నా తాపత్రయం అని చెప్పుకొచ్చింది. 
 
మాది తమిళనాడుకు చెందిన సంప్రదాయ కుటుంబం. నాన్న కన్నడిగుడు, అమ్మ తమిళ వనిత. నాకు ఈ రెండు భాషలూ వచ్చు. ‘గ్యాంగ్‌ లీడర్‌’ సమయంలో తెలుగు రాకపోవడంతో కాస్త ఇబ్బందిపడ్డా. కానీ తెలుగు, కన్నడ భాషల్లో సారూప్యం వల్ల త్వరగా నేర్చుకోగలిగా. స్పష్టంగా మాట్లాడలేకపోయినా, ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతున్నట్టు చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరాశపరిచిన మూడు చిత్రాలు.. కలెక్షన్లు అంతంత మాత్రమే...