విలన్ కమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తన 31వ చిత్రం "భీమ"లో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది.
తాజాగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో కథానాయికగా రాణించనుంది. “కల్యాణం కమనీయం” సినిమాతో ఈమె తెలుగులోకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. అలాగే ఈ చిత్రంలో మాళవిక శర్మ కూడా నటిస్తోంది. రెడ్, నేల టికెట్ వంటి చిత్రాల్లో నటించింది.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్‌గా నటిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.