Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లారెన్స్‌కు రుద్రుడు ఆదుకొనేనా! రివ్యూ

Advertiesment
Rudurdu
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:50 IST)
Rudurdu
యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు తెలుగు, తమిళ భాషల్లో నేడో విడుదల అయింది.  ప్రియా భవానీ శంకర్ కథానాయిక.  శరత్ కుమార్ విలన్. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మించింది.  కతిరేశన్ సమర్పకులు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశా 
 
రాఘవ లారెన్స్‌ సినిమాలు పక్కా మాస్‌ తరహాలో వుంటాయి. ప్రేమ, యాక్షన్‌, సెంటిమెంట్‌తోపాటు దైవం అంశాన్ని ఎంచుకుంటాడు. ఈరోజు విడుదలైన రుద్రుడు కూడా అలాంటిదే. అమ్మ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే లారెన్స్‌ ఈసారి చేసిన రుద్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.
 
కథ:
రుద్ర (లారెన్స్‌) ట్రావెల్‌ ఏజెన్సీ నడిపే నాజర్‌ కొడుకు. వ్యాపారం ఇష్టపడని రుద్ర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరతాడు. అక్కడ పరిచయమైన అనన్య (ప్రియాభవాని శంకర్‌)ను పెండ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత నాజర్‌కు పార్టనర్‌గా వున్న ఓ వ్యక్తి మోసం చేయడంతో కోట్ల రూపాయలు బాకీపడతాడు. అది తట్టుకోలేక గుండెపోటుతో నాజర్‌ చనిపోతాడు. గత్యంతరం లేని స్థితిలో తన కంపెనీ ద్వారా అమెరికా వెళతాడు రుద్ర. అక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటాడు. భార్య, తల్లి ఇండియాలోనే వుంటారు. ఓసారి తన భార్య అమెరికా వస్తుంది. తల్లిని ఒంటరిగా వదిలి వచ్చావేమిటి అని అడిగి రెండు రోజులు తర్వాత తిరిగి అనన్యను ఇండియా పంపిస్తాడు రుద్ర. ఇక ఆ తర్వాత అనన్య కనిపించకుండా పోతుంది. తల్లి చనిపోతుంది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఇండియా వచ్చిన రుద్రకు షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి. అవి ఏమిటి? మిగిలిన కథ ఎలా తీశాడు అన్నది సినిమా.
 
విశ్లేషణ:
లారెన్స్‌ సినిమాల్లో బాగా జనాలు కనెక్ట్‌ అయింది కాంచన, ముని వంటి సినిమాలు. అందులో అన్ని అంశాలున్నాయి. రుద్రుడు కూడా ఆ తరహాలో వుంటుందనే ప్రేక్షకులు నిరాశే మిగులుతుంది. మొదటి భాగమంతా అల్లరిచిల్లరిగా ప్రేమ కోసం అనన్య వెంటపడడంతోనే సరిపోతుంది. రెండో పార్ట్‌లోనే కథ ఏమిటో అర్థమవుతుంది. ఇందుకు కొన్ని నాటకీయ సన్నివేశాలు కూడా తోడయ్యాయి. పాటలు, యాక్షన్‌ మోతాడు అఖండకుమించినట్లుగా వున్నాయి. సౌండ్‌ పొల్యూషన్‌ కావాల్సినంత వుంది. ఇవన్నీ ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు దర్శక నిర్మాత, హీరోలు భావించారు.
 
రుద్రుడు అనేది రొటీన్‌ కథే. అయితే ఇందులో ఆలోచించాల్సిన అంశాన్ని తెలియజేశాడు. తల్లిదండ్రుల్ని వదిలేసి విదేశాలకు వెళ్ళి తిరిగిరావడానికి ఇష్టపడని యూత్‌కు కనువిప్పు కలిగే పాయింట్‌ తీసాడు. గతంలో చాలా చోట్ల జరిగిన సంఘటనలను తీసుకుని దర్శక నిర్మాత కతిరేసన్‌ తీసినట్లుంది. ఇది అలాంటివారు ఆలోచించాల్సిన అవసరమూ వుంది.
 
ఇక సాంకేతికపరంగా చూడాలంటే పాటలకు చేసిన కొరియోగ్రఫీ లారెన్స్‌దే పైచేయి. సంగీతం ఓకే. సంభాషణలు సాదాసీదాగానే వున్నాయి. నటనాపరంగా లారెన్స్‌ ఈజీగా చేశాడు. కానీ ఫుల్‌ మేకప్‌తో కొన్నిచోట్ల రజనీ స్టయిల్‌ను అనుకరించాడు. యాక్షన్‌సన్నివేశాల్లో అఖండను ఫాలో అయ్యాడు. ఆ ఫైట్‌ మాస్టర్‌తోనే యాక్షన్‌ సీన్స్‌ చేయించాడు. ప్రతి సినిమాలోనూ ముగింపు ఓ దేవాయంలో చేస్తుంటాడు లారెన్స్‌ ఇందులోనూ శివాలయం దగ్గర చేసి ఓ రౌద్రమైన పాటతో విలన్‌కు ముగింపు ఇస్తాడు. అయితే ఇంత చేసినా ఆకట్టుకునే అంశాలు పెద్దగా లేకపోవడంతో రొటీన్‌గా అనిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పెద్దగా లేదు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ప్రేక్షకుల ఆదరణబట్టే తెలుస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళికి అరుదైన గౌరవం.. ప్రభావశీలుర జాబితాలో చోటు - అలియా ప్రశంసలు