Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"బ‌జార్ రౌడి"తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌

, సోమవారం, 30 నవంబరు 2020 (18:35 IST)
ఒన్ అండ్ ఓన్లీ బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా అప్‌డేట్ అంటే యావ‌త్ తెలుగు సినిమా షెక్ అవ్వాల్సిందే. ఆయ‌న న‌టించిన‌ చిత్రాలు హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్‌డూప‌ర్ హిట్  అయ్యి సంపూర్ణేష్ బాబు స‌త్తా ని టాలీవుడ్ మెత్తం చాటింపువేశాయి. లాక్‌డౌన్ త‌ర్వాత బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి "బ‌జార్ రౌడి" అనే టైటిల్ని ఖ‌రారు చేశారు. 
 
ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న చిత్రానికి ద‌ర్శ‌కుడు వసంత నాగేశ్వ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. కె.ఎస్. క్రియేష‌న్స్ బ్యాన‌రులో రూపోందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడిగా మ‌హి న‌టిస్తుంది. పాట‌ల్లో సంపూర్ణేష్ బాబు డాన్స్‌ల‌కి ఆయ‌న వేసే స్టెప్స్‌కి వున్న క్రేజ్ చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ క్రేజ్‌ని ఇప్పుడు బ‌జార్ రౌడి టీం డ‌బల్ చేస్తున్నారు.
 
"ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు, య‌మ‌దోంగ‌, ప‌రుగు, మ‌గ‌ధీర‌, ఆర్య‌-2, డార్లింగ్‌, సింహ‌, మ‌ర్యాద‌రామ‌న్న‌, 100% ల‌వ్‌, బృందావ‌నం, కందిరీగ‌, పూల‌రంగ‌డు, ఇష్క్‌, ర‌చ్చ‌,సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, భాహుబ‌లి -1, భాహుబ‌లి-2, రంగ‌స్థ‌లం" వంటి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కే కాకుండా త‌మిళంలో "మార్ష‌ల్‌, వీరం, శ‌గుని, వేలాయుదం" లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కి సూప‌ర్‌స్టార్స్‌కి కొరియోగ్ర‌ఫి అందించిన ట్రెండ్‌సెట్టింగ్ కొరియెగ్రాఫ‌ర్ మాస్ట‌ర్ ప్రేమ్‌ర‌క్షిత్ ఈ బ‌జార్ రౌడి‌తో స్టెప్స్ వెయిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ షూటింగ్ రామెజిఫిల్మ్ సిటిలో జ‌రుగుతుంది. 
 
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు వ‌సంతి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ఎంతో బిజిగా వుండి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్స్‌కి కొరియోగ్రాఫర్‌గా ప‌నిచేసి ఆ చిత్రాల గ్రాఫ్‌ని మార్చేసిన ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ మా చిత్రంలో మా బ‌జార్ రౌడితో స్టెప్స్ వెయించి మా చిత్రం గ్రాఫ్‌ని మార్చినందుకు ఆయ‌న‌కి హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ సాంగ్ ప్ర‌స్తుతం రామెజి ఫిల్మ్‌సిటిలో 20 మంది డాన్స్‌ర్స్‌తో హీరో సంపూర్ణేష్ బాబు, మ‌హిళలపై చిత్రీక‌రిస్తున్నాం. ఈ చిత్రానికి సంబందించిన టాకి పూర్తిచేసాము. త్వ‌ర‌లో క్లైమాక్స్, మ‌రో రెండు సాంగ్స్‌తో షూటింగ్ పూర్త‌వుతుంది. 
 
ఈ చిత్రానికి బ‌జార్ రౌడి అనే టైటిల్ అనుకున్న వెంట‌నే మా యూనిట్ అంద‌రి ద‌గ్గ‌ర‌నుండి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం మాలో కొత్త ఎనర్జి వ‌చ్చింది. మా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావుగారు బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా లిమిటేష‌న్ పెట్ట‌కుండా చిత్రాన్ని నిర్మిస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ శేఖ‌ర్ గారు త‌న అనుభ‌వంతో ఎక్క‌డ ఖ‌ర్చుపెడితే స్క్రీన్ మీద క‌న‌బ‌డుతుందో చ‌క్క‌టి ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రం లో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో షియాజి షిండే, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వి, నాగినీడు, ష‌ఫి, జీవ‌, స‌మీర్‌, మ‌నిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి లాంటి భారీతారాగాణం తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెద‌టి లుక్‌, టీజ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం..అన్నారు.
 
న‌టీన‌టులు..
బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు. మ‌హి, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్ , ఎస్ వి ఎస్ నాయుడు త‌దిత‌రులు..
 
మాట‌లు.. మ‌రుధూరి రాజా, 
డి ఓ పి.. ఏ విజ‌య్ కుమార్‌,
సంగీతం.. సాయికార్తిక్‌, 
ఫైట్ మాస్ట‌ర్‌.. జాషువా, 
కాస్ట్యూమ్స్‌.. ప్ర‌సాద్‌, 
మేక‌ప్‌..శ్రీకాంత్‌, 
కొ-డైర‌క్ట‌ర్‌.. కె.శ్రీనివాస‌రావు 
పిఆర్‌ఒ.. ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి, 
నిర్మాత‌.. సందిరెడ్డి శ్రీనివాస‌రావు.
ద‌ర్శ‌క‌త్వం.. వసంత నాగేశ్వ‌రావు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యంగ్‌ హీరో నాగశౌర్య కొత్త చిత్రం 'ల‌క్ష్య'