Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్య ఆలయాన్ని సందర్శించిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ

Prashant Varma, Teja Sajja
, బుధవారం, 30 నవంబరు 2022 (16:44 IST)
Prashant Varma, Teja Sajja
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఇటివలే విడుదలైన ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హను-మాన్‌ టీజర్ యావత్ దేశం హనుమంతుని నామం జంపించేలా చేసింది.
 
నిన్న, దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించారు. టీజర్‌ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌ ను ప్రారంభించడానికి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు.
 
అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
 
తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ఆరోగ్యం ఆందోళనకరంగా వుందా? దక్షిణ కొరియాకు తీసుకెళ్తున్నారా?