ప్రముఖ యూ ట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ అయ్యాడు. తనతో నటిస్తున్న వర్థమాన నటి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వెకిలి వేషాలు వేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో prasad behera ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడమూ అతడికి 14 రోజులు రిమాండు కూడా విధించబడింది.
కాగా అతడు ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ, పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రసాద్ తనను తాకరాని చోట తాకాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో అప్పటికప్పుడు ఆ సిరీస్ నుంచి తప్పుకుని వెళ్లిపోయినట్లు చెప్పింది.
ఆ తర్వాత పలుమార్లు తనకు క్షమాపణలు చెప్పిన తర్వాత తిరిగి అతడితో కలిసి నటించేందుకు అంగీకరించినట్లు నటి తెలియజేసింది. కానీ అతడి బుద్ధి ఎంతమాత్రం మారలేదనీ, ఈ నెల 11వ తేదీన రెండున్నర గంటల సమయంలో యూనిట్ సభ్యులందరి ముందు తన బ్యాక్ ను అసభ్యకరంగా తాకడంతో అలా తన వెనుక భాగంపై ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తే అతడి నుంచి సరైన సమాధానం రాలేదని పేర్కొంది. షూటింగ్ చేస్తున్న సమయంలో కూడా తన బ్యాక్ సైడ్ గురించి యూనిట్ సభ్యుల ముందు వెకిలిగా మాట్లాడాడనీ, కంప్లైంట్ చేస్తానని చెప్పినా కూడా అతడి పద్ధతి మార్చుకోలేదంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. దీనితో అతడిని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.