శరవేగంగా ప్రభాస్ కొత్త సినిమా.. ఖర్చు రూ.150 కోట్ల మాత్రమేనట
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగేళ్లపాటు తన టైమంతా బాహుబలికే రాసిచ్చేసిన ఈ ఆరడుగుల అందగాడు మూవీ క్రియేషన్స్ పతాకంపై రన్ రాజా ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమాకు నాంది పలికాడు.

ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్న సినిమా సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రభాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు క్లాప్ ఇవ్వగా, నిర్మాత ‘దిల్’ రాజు కెమేరా స్విచ్చాన్ చేశారు.
150 కోట్లతో ఈ సినిమాను నిర్మించనున్నారట. దీని తర్వాత వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, నృత్యాలు రాజు సుందరం, కెమేరా మది, సంగీతం శంకర్–ఎహసాన్–లాయ్.