Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

kalki

వరుణ్

, బుధవారం, 26 జూన్ 2024 (14:49 IST)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన "కల్కి 2898 ఏడీ" చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ప్రపంచ వ్యాప్తంగా పది వేలకు పైగా స్క్రీన్స్‌లలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా భారీగా ప్రీమియర్ షోస్ టిక్కెట్స్ బుక్ అయ్యాయి. ఓవర్సిస్‌లో కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు లేని విధంగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. విదేశాల్లో రిలీజ్‌కు ముందే రికార్డ్ లెవెల్‌లో టికెట్స్ బుక్ అయ్యి 3 మిలియన్ క్లబ్‌లోకి వెళ్ళిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అదనంగా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు, టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణాలో 75 రూపాయలు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లో 100 రూపాయలు పెంపు వచ్చే నెల 8వ తేదీ వరకు ఐదు ఆటలతో పాటు టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సింగిల్ స్క్రీన్స్ రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.125 టిక్కెట్ రేటు పెంపుకు అనుమతతో పాటు అదనపు ఆటకు కూడా అనుమతి ఇచ్చింది. ఐదు ఆటలను వచ్చే రెండు వారాల పాటు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మువిస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రత్యేకపాత్రల్లో విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సపోర్టింగ్ రోల్స్‌లో బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక, పశుపతి తదితరులు నటించారు. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే అడియన్స్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మూవీ కల్కీ థీమ్ సాంగ్ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రభాస్ గత చిత్రం సలార్‌కు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.178 కోట్లు గ్రాస్ కాగా, కల్కి ఫస్ట్ డే రూ.190 కోట్లకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. 
 
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మహాభారతంలోని సంఘటనల నుండి భవిష్యత్తులో 2898 ఎడి వరకు సహస్రాబ్దాల ప్రయాణాన్ని వివరిస్తూ సాగే కథగా ఈ చిత్రం సాగుతుంది. రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి ఇండియన్ మూవీ కల్కి కావడం గమనార్హం. ప్రభాస్ ఆదిపురుష్ రూ.120 కోట్ల బిజినెస్‌ను అందుకోగా.. సలార్ రూ.145 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. కల్కికి రూ.170 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రూ.380 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!