Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌తో శారీరకంగా దూరమైనా మనసంతా ఆయనతోనే.. రెండో పెళ్లిపై రేణూ దేశాయ్

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై స్పందించారు. పవన్ - రేణూలు వైవాహిక బంధం నుంచి వేరుపడినప్పటికీ... రేణు మాత్రం ఒంటరిగానే జీ

Advertiesment
పవన్‌తో శారీరకంగా దూరమైనా మనసంతా ఆయనతోనే.. రెండో పెళ్లిపై రేణూ దేశాయ్
, శుక్రవారం, 10 మార్చి 2017 (09:21 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై స్పందించారు. పవన్ - రేణూలు వైవాహిక బంధం నుంచి వేరుపడినప్పటికీ... రేణు మాత్రం ఒంటరిగానే జీవిస్తుండగా, పవన్ కల్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో రేణు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వాస్తవానికి, రెండో పెళ్లి గురించి చాలా గందరగోళానికి గురైనట్టు చెప్పారు. ఇదే అంశంపై ఓ కౌన్సిలర్ వద్దకు కూడా వెళ్లానని చెప్పింది. ఆమెకు తనలో ఉన్న భావాలన్నింటినీ చెప్పానని... దీంతో, మరో పెళ్లి చేసుకోవచ్చు కదా? అని సలహా ఇచ్చిందన్నారు. 
 
కానీ, తాను పవన్‌‍తో వైవాహికంగా, శారీరకంగా మాత్రమే విడిపోయినా అతనిపై తనకు ప్రేమ ఉందని చెప్పినట్టు తెలిపింది. ఒక వేళ రెండో పెళ్లి చేసుకున్నా తనకు తోడు మాత్రమే లభిస్తుందని... తన ప్రేమను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పంచలేనని రేణు చెప్పింది. పెళ్లి చేసుకున్న వ్యక్తి తన పిల్లలకు సవతి తండ్రి అవుతాడే తప్ప తండ్రి కాలేడు కదా? అని ప్రశ్నించింది. రెండో పెళ్లిలో ఖచ్చితంగా ప్రేమ ఉండదని తేల్చి చెప్పింది.
 
రెండో పెళ్లి దిశగా తనకు కూడా ఆలోచనలు వస్తుంటాయని, కానీ, కొన్ని భయాలు వెంటాడుతుంటాయని తెలిపింది. రెండో పెళ్లి తర్వాత కూడా మళ్లీ తొలిసారి ఎదురైన అనుభవాలే ఎదురవుతాయేమోననే భయం వెంటాడుతుందని చెప్పింది. మళ్లీ ప్రేమలో పడతానో లేదో కూడా తెలియదని చెప్పింది. సరైన వ్యక్తి దొరికితే తన రెండో పెళ్లి విషయం స్వయంగా చెబుతానని రేణూ దేశాయ్ తన మనస్సులోని మాటను వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భావనపై నిజంగానే అత్యాచారం చేయలేదా.. పోలీసుల యూటర్న్‌కి కారణమేంటి?