భావనపై నిజంగానే అత్యాచారం చేయలేదా.. పోలీసుల యూటర్న్‌కి కారణమేంటి?
మలయాళ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు తుస్సుమంటోందా.. అమెపై వాహనంలోనే అత్యాచారం చేశారని తాము చూసినంత నమ్మకంగా తొలి రోజు మీడియాకు ఎక్కిన పోలీలులు ఏమీ జరగలేదని చెప్పడం షాక్ కలిగిస్తోంది. పైగా తమ దర్యాప్తు నివేదికతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో
మలయాళ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు తుస్సుమంటోందా.. అమెపై వాహనంలోనే అత్యాచారం చేశారని తాము చూసినంత నమ్మకంగా తొలి రోజు మీడియాకు ఎక్కిన పోలీలులు ఏమీ జరగలేదని చెప్పడం షాక్ కలిగిస్తోంది. పైగా తమ దర్యాప్తు నివేదికతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని సవాలు చేస్తున్నారు కూడా..
మలయాళ హీరోయిన్ వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి లభించిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న హీరోయిన్‌ను కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు వేధించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పల్సర్ సుని అనే వ్యక్తిని, హీరోయిన్ వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి తమకు లభ్యమైందని పోలీసులు చెబుతున్నారు.
కారులో ఆమెను వేధిస్తుండగా మొబైల్‌లో తీసిన వీడియో బయటపడిందని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడటానికి బ్లాక్‌మెయిల్ చేయాలనే యోచనే ప్రధాన కారణమని తేలిందని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం, భారీ కుట్ర కోణం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.
తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని.. తమకెటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కాగా, మార్టిన్, పల్సర్ సుని తదితరుల పోలీసు కస్టడీ గడువు రేపటితో ముగియనుంది. మలయాళ చిత్రపరిశ్రమ పరువు కాపాడటానికో లేక దాంట్లోని పెద్ద తలలను ఒడ్డున పడేయటానికో పోలీసులు చల్లబడిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘాతుకానికి ఒడిగట్టినవాడి డీఎన్‌ఎ కూడా వాడు అత్యాచారం చేశాడని చూపించిందని తొలిరోజు కేరళ సీనియర్ పోలీసు అధికారి చెప్పిన విషయం తెలిసింది. అంతలోనే ఏం మాయరోగం వచ్చిందో..