Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవర ప్రీరిలీజ్ వాయిదా పడటంపై ఎన్.టి.ఆర్. ఎమోషనల్ వీడియో

Advertiesment
NTR

డీవీ

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (07:03 IST)
NTR
నిన్న రాత్రి హైదరాబాద్ లో దేవర సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ ఫంక్షన్ హాల్ లో జరగాల్సి వుంది. కానీ అభిమానులు అంతకుమించి వచ్చినట్లుగా రావడం, పోలీసులు నిరాకరించడంతో చాలామంది నిస్సహాయకత లోనై కొందరు ఫంక్షన్ హాల్ పై రాల్ళు విసిరారు. నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను తిడుతూ నినాదాలు చేశారు. ఇది గ్రహించిన పోలీసులు ఫంక్షన్ వాయిదా వేయాలని సూచించారు. దాంతో అట్టహాసరంగా జరగాల్సిన దేవర వేడుక రద్దు చేయకతప్పలేదు. 
 
దీనిపై ఎన్.టి.ఆర్. ఓ వీడియోను విడుదలచేసి అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని సూచించారు. ఆయన మాటల్లోనే... అభిమానులకు సోదరులకు నమస్కారం. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధాకరం. నాకింకా చాలా బాధగా వుంటుంది. అవకాశం వున్నప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవర మూవీ గురించి నేను పడిన కష్టం వివరిద్దామని చాలా ఎగ్జైట్ గా వున్నా. కానీ పోలీసుల సెక్యూరిటీ కారణాలవల్ల వాయిదా వేయడం జరిగింది.
 
కానీ ఇలా జరగడం నిర్మాతలను, ఈవెంట్ నిర్వాహకులను బ్లేమ్ చేయడం తప్పు. మీరు చూపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడూ క్రుతజ్నతతో వుంటాను. మన అందరం ఈనెల 27 న సినిమా థియేటర్లలో కలుద్దాం. మీ అందరూ కాలర్ ఎగరేసేలా దేవర సినిమా వుంటుంది. అలా చేయడం నా బాధ్యత. ఆ ఆనందం చెప్పలేనిది. రేపు థియేటర్లలో అదే జరుగుతుంది. కొరటాల శివ గారు అద్భుతంగా  సినిమా తీశారు. మీ ఆశీర్వాదం నాకూ, సినిమాకూ చాలా అవసరం. మరో విన్నపం జాగ్రతతగా అందరూ తిరిగి వెళళాలని కోరుకుంటూ. జై. ఎన్.టి.ఆర్. అంటూ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు... ఎందుకో తెలుసా?