Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

పవన్ కల్యాణ్ ఆ పని చేస్తే చంపేస్తారు: పోసాని కృష్ణమురళి

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మద్దతు పలికారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారని.. పవన్ వెనుక బీజేప

Advertiesment
Posani Krishna Murali
, గురువారం, 22 మార్చి 2018 (11:40 IST)
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మద్దతు పలికారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారని.. పవన్ వెనుక బీజేపీ హస్తం వుందని వస్తున్న విమర్శలపై పోసాని స్పందించారు. 
 
పవన్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పోసాని అన్నారు. దీనికి సంబంధించి ఏవైనా ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పవన్ కలిసుంటే ఆయనకు ఎన్నో ప్రయోజనాలుంటాయని.. అయినా జనసేన ఆవిర్భావ సభా వేదికపై నుంచి విమర్శలు గుప్పించారంటే.. ఆ విమర్శల్లో నిజమే వుంటుందని పోసాని నమ్మకం వ్యక్తం చేశారు. 
 
పవన్‌ను తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అవినీతి జరగలేదని చెప్పే టీడీపీ నేతలు, ప్రాజెక్టుల్లో ఖర్చు పెట్టిన ప్రతిపైసాకి లెక్క చెప్పి తమ నిజాయతీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తాను పవన్‌కు మద్దతిస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తే.. తాను మద్దతు ఇస్తానని చెప్పారు. 
 
కానీ నిరాహార దీక్షకు కూర్చోవాలని తాను కోరుకోవట్లేదన్నారు. అందరూ బాగున్నప్పుడు పవన్ మాత్రమే ఎందుకు నిరాహార దీక్ష చేయాలని ప్రశ్నించారు. పవన్‌ను ఎగదోసి.. ఆమరణ దీక్షకు కూర్చోబెడితే ఆయన్ని చంపినా చంపేస్తారని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే నిరాహార దీక్షకు అందరూ కూర్చుంటేనే.. పవన్ కూడా కూర్చోవాలని లేకుంటే దీక్ష వద్దని పోసాని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదనీ భార్య - పిల్లలను హత్య చేసిన భర్త