Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఫ్‌.3 చిత్రంలో పార్టీ సాంగ్‌తో అల‌రిస్తున్న పూజా హెగ్డే

Advertiesment
Pooja Hegde party song
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:13 IST)
Pooja Hegde party song
బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రం త‌ర్వాత అంత‌కుమించి వుండేలా ఎఫ్‌3ని రూపొందిస్తున్నారు. విక్టరీ వెంకటేష్,  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
విశేషం ఏమంటే, స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల‌లో ఒక‌రైన‌  పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రత్యేకమైన పార్టీ సాంగ్‌ ద్వారా ఈరోజు షూట్‌లో జాయిన్ అయింది. నేటి నుంచే ఈ పాట చిత్రీకరణ మొదలైంది.  అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వ‌ర్యంలో రూపొందిన అత్యద్భుతమైన సెట్‌లో సాంగ్‌ చిత్రీకరణ జ‌రుగుతోంది.
 
ఈ సాంగ్  కోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అనుగుణ‌మైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన ట్యూన్‌ను రూపొందించారు.. ఈ పార్టీ సాంగ్‌లో విశేషమేమిటంటే, పూజా హెగ్డేతో పాటు  ప్రధాన తారాగణం అయిన వెంకటేష్, వరుణ్ తేజ్‌, హీరోయిన్లు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పూజా హెగ్డే స్పెషల్ డ్యాన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వీళ్లందరినీ కలిసి స్క్రీన్‌పై చూడడం నిజంగా పండగే.
 
ఎఫ్2లో న‌టించిన  రాజేంద్రప్రసాద్  ఎఫ్3లో భాగం కాగా, సునీల్ ఈ చిత్రానికి మ‌రో ఎస్సెట్‌.
 
దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌గా,  ఎడిటర్ గా తమ్మిరాజు, సహ నిర్మాతగా హర్షిత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
F3 చిత్రం మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
 
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: అనిల్ రావిపూడి
సమర్పకుడు: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
DOP: సాయి శ్రీరామ్
కళ: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అదనపు స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టిన "కేజీఎఫ్-2"