చేపలు, సలాడ్స్ అంటే పూజా హెగ్డేకి ఎంతో ఇష్టం, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఆమెకి ఇష్టమే. ఆమె రోజువారీ భోజనం అలవాట్లు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
పూజాకి కాఫీ అంటే చాలా ఇష్టం. ఐతే ఔషధీయ గుణాలున్న గ్రీన్ టీ సేవిస్తుంటుంది.
అల్పాహారంగా ఉడకబెట్టిన కోడుగుడ్లు తింటుంది, దాంతోపాటు మినపదోశెలు కూడా ఇష్టమే.
భోజనం చేసేముందు, ఉదయం 11 గంటల సమయంలో యాపిల్స్, బొప్పాయి తదితర పండ్లను తీసుకుంటుంది.
భోజనంలో వెజ్ లేదా నాన్ వెజ్ ఏదయినా ఓకే. చికెన్, రొయ్యలు, చేపలు అంటే చాలా ఇష్టం.
సాయంత్రం 4 గంటల సమయంలో బాదములు, వాల్‌నట్స్, జీడిపప్పు వంటివి తీసుకుంటారు.
సాయంత్రం స్నాక్స్ విషయంలో పండ్లకు అధిక ప్రాధాన్యతనిస్తుంటుంది.
రాత్రి భోజనం విషయంలో పూజా హెగ్డే కొన్నిసార్లు చికెన్, మరికొన్నిసార్లు వెజ్ ఐటమ్స్ తీసుకుంటారు.
ఇలా తన ఫిట్నెస్ విషయంలో తీసుకోవాల్సిన పదార్థలపై చాలా శ్రద్ధ చూపుతారు పూజా హెగ్డే.