Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై నటి నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది.. బుర్రకథతో వచ్చి...?

Advertiesment
ముంబై నటి నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది.. బుర్రకథతో వచ్చి...?
, బుధవారం, 16 జూన్ 2021 (08:38 IST)
Naira Shah
టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన ముంబై నటి నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది. 2019లో వచ్చిన బుర్రకథ చిత్రంలో ఆది హీరో కాగా, నైరా షా కూడా నటించింది. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకుడు.
 
నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం మరింత కలకలం రేపుతోంది. 'బుర్రకథ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ నైరా షా ముంబయిలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాదకద్రవ్యాలు ఉపయోగిస్తూ దొరికిపోయింది. 
 
నైరా షా తన పుట్టినరోజు సందర్భంగా జుహూ ప్రాంతంలోని ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంది. తన స్నేహితుడు ఆషిక్ ఎస్ హుస్సేన్ తో కలిసి పార్టీ చేసుకుంది. అయితే, నార్కొటిక్స్ విభాగం అధికారులు వెళ్లే సమయానికి నైరా షా, ఆషిక్ హుస్సేన్ గంజాయి నింపిన సిగరెట్లు తాగుతూ దర్శనిమిచ్చారు.
 
పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లోనూ నైరా షా, ఆషిక్ హుస్సేన్ మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు జోస్యం చెప్పిన శ్రీ‌రెడ్డిపై అభిమానులు ఫైర్‌