Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి దగ్గరపడితేనేమీ.. చేనేత దుస్తుల్లో హాట్ హాట్‌గా అందాలను ఒలకబోసిన సమంత...

అక్కినేని నాగార్జున ఇంటి కోడలు కానున్న సమంత.. పెళ్లికి సిద్ధమవుతూనే తన కెరీర్‌ను సరైన మార్గంలో నడిపించుకుంటూ పోతోంది. ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. ఆ సినిమా కో-స్టార్ నాగచైతన్యనే మనువాడ

Advertiesment
Pic Talk
, శుక్రవారం, 26 మే 2017 (17:57 IST)
అక్కినేని నాగార్జున ఇంటి కోడలు కానున్న సమంత.. పెళ్లికి సిద్ధమవుతూనే తన కెరీర్‌ను సరైన మార్గంలో నడిపించుకుంటూ పోతోంది. ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసి.. ఆ సినిమా కో-స్టార్ నాగచైతన్యనే మనువాడనున్న సమంత.. తాజాగా హాట్ హాట్‌గా కనిపించి.. అందరికీ షాక్ ఇచ్చింది. తద్వారా పెళ్ళి దగ్గరపడుతున్నా.. అందాల ఆరబోతకు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని సమంత నిరూపించింది.
 
అక్టోబర్ ఆరో తేదీన నాగచైతన్యను పెళ్ళాడనున్న సమంత ప్రస్తుతం చేతినిండా ఆఫర్లను కలిగివుంది. తెలుగులో రాజుగారి గది2, సావిత్రి, రామ్ చరణ్‌తో మరో సినిమాలో నటించే ఈ ముద్దుగుమ్మ, కోలీవుడ్‌లోనూ భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా నటిస్తూ.. కెరీర్‌పరంగా దూసుకెళ్లాలనుకుంటున్న సమంత.. తాజాగా జేఎఫ్‌డబ్ల్యూ మేగజీన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది.
 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాలకు సమంత ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోటో షూట్‌లో సమంత చేనేత వస్త్రాలు ధరించింది. కానీ చేనేత వస్త్రాలు ధరించినా.. గ్లామర్ మాత్రం తగ్గలేదు. ఇకపోతే.. సమంత్ ఫొటో షూట్‌తో చేనేత వస్త్రాలకు సరికొత్త గ్లామర్ వచ్చిందని సినీ పండితులు అంటుండగా, పెళ్ళికి ముందు ఇలాంటి హాట్ ఫోటో షూట్ అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే ఏం లేదు వదినా... దంచి మందు ఇవ్వమన్నారు...