Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగ శౌర్య, రీతువర్మ - వరుడు కావలెను - నుంచి పెళ్ళి వేడుక గీతం

నాగ శౌర్య, రీతువర్మ - వరుడు కావలెను - నుంచి పెళ్ళి వేడుక గీతం
, శనివారం, 2 అక్టోబరు 2021 (15:58 IST)
Naga Shourya, Rituvarma
నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘. శ‌నివారంనాడు యూనిట్ చిత్రంలోని ఓ వీనుల విందైన గీతాన్ని విడుదల చేశారు. 
 
ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే కన్నుల పండుగ గా అ(క)నిపిస్తుంది. వివరాల్లోకి వెళితే…‘‘ వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు ...వయ్యారం చిందేసే అందాల భామలు" అంటూ సాగే ఈ గీతం రచయిత రఘురామ్ రచిం చారు. ఈ గీతాన్ని గాయనీ, గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి, ఎం ఎల్ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతి రంజని లు వీనుల విందుగా ఆలపించారు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం  హుషారుగా సాగుతుంది. 
 
చిత్ర నాయకా నాయిక లు ‘నాగశౌర్య, రీతువర్మ‘ లతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్ర కథానుసారం ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో  తెర రూపంగా  ఈ గీతం కనిపిస్తుంది. హుషారైన సంగీతం, చక్కని సాహిత్యం ఈ పాట సొంతం. వీటికి తోడు బృంద మాస్టర్ నృత్య రీతులు మరింత హుషారెత్తిస్తాయి.ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 న దసరా కానుకగా చిత్రం విడుదల.
 
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
 
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌, నిర్మాత: సూర్య దేవర నాగవంశి,  కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐశ్వర్య ఆర్‌. ధనుష్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ తెలుగు సినిమా