Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేఖలో కృతజ్ఞతలు తెలిపిన పవన్... మరోసారి వ్యక్తమైన పవన్ నైజం

పవన్ కళ్యాణ్ తన సినిమాలతోనే కాదు.. నిజజీవిత ప్రవర్తనతో కూడా ఎంతోమంది అభిమానుల మనస్సులను దోచుకున్న కథానాయకుడు. ఫ్యాన్స్‌ పవన్‌ కల్యాణ్‌ను కేవలం సినిమా హీరోగానే చూడరు.. నిండైన వ్యక్తిత్వం ఉన్న వాడిగా, మంచి మనసున్న వ్యక్తిగా భావిస్తారు. పవన్‌ కూడా అభిమా

Advertiesment
Pawan Kalyan
, శుక్రవారం, 8 జులై 2016 (14:22 IST)
పవన్ కళ్యాణ్ తన సినిమాలతోనే కాదు.. నిజజీవిత ప్రవర్తనతో కూడా ఎంతోమంది అభిమానుల మనస్సులను దోచుకున్న కథానాయకుడు. ఫ్యాన్స్‌ పవన్‌ కల్యాణ్‌ను కేవలం సినిమా హీరోగానే చూడరు.. నిండైన వ్యక్తిత్వం ఉన్న వాడిగా, మంచి మనసున్న వ్యక్తిగా భావిస్తారు. పవన్‌ కూడా అభిమానుల అంచనాలకనుగుణంగానే నడుచుకుంటారు. తనకు నచ్చిన వాళ్లకు బహుమతులు పంపడం, సహాయం చేసిన వారికి రాతపూర్వకంగా ధన్యవాదాలు తెలపడం అయన స్టైల్‌. అలా తన మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్‌ రాసిన ఉత్తరమంటూ ఒక లేఖ ఆన్‌లైన్‌లో సందడి చేస్తోంది.
 
గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని తన స్వంత ఖర్చులతో పవన్‌ పునర్ముద్రణ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని తనకు పరిచయం చేసిన త్రివిక్రమ్‌కు, రీప్రింట్‌కు అంగీకరించిన శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకికి పవన్‌ ఆ లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు.‘ఓ దేశ సంపద ఖనిజాలు కాదు. నదులు కాదు. అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత మన దేశానికి నావికులు అని శేషేంద్ర శర్మ గారు రాసిన మాటలు ఆయన్ని అమితంగా ఇష్టపడేలా చేశాయి. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని ఆయన వేసిన ప్రశ్న నాకు మహావాక్యం అయింది.
 
నాకు మహా ప్రీతిపాత్రమైన ‘ఆధునిక మహాభారతం’ గ్రంథం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేవారికి అందుబాటులో ఉండాలనే నా ఆకాంక్ష.. ఈ గ్రంథాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువచ్చేలా చేసింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శేషేంద్ర శర్మ గారి అబ్బాయి, కవి సాత్యకి గారికి, నాకీ మహాకవిని పరిచయం చేసిన నా మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌‌గారికి నా కృతజ్ఞతలు’ అని ఆ లేఖలో రాశారు. ఈ లేఖలో పవన్‌ కల్యాణ్‌ సంతకంతో పాటు కింద 18-5-2016 డేట్‌ కూడా ఉంది. అయితే ఇది లేఖా?, లేకపోతే ఆ పుస్తకం కోసం రాసిన ముందుమాటా అనేది తెలియలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనసూయ హాట్ ఫోటో షూట్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!