Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనసూయ హాట్ ఫోటో షూట్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

యాంకర్స్ కూడా సెక్సీగా ఉంటారని అనసూయను చూస్తే అర్థమవుతుంది. అనసూయ సినీ ప్రవేశం యాంకరింగ్‌తోనే మొదలైంది. యాంకరింగ్ చేయటం అంటే నోటికొచ్చింది మాట్లాడటం కాదు.. వచ్చిన వారితో కాస్త కనుల విందుగా అందంగా, సెక

అనసూయ హాట్ ఫోటో షూట్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!
, శుక్రవారం, 8 జులై 2016 (13:07 IST)
యాంకర్స్ కూడా సెక్సీగా ఉంటారని అనసూయను చూస్తే అర్థమవుతుంది. అనసూయ సినీ ప్రవేశం యాంకరింగ్‌తోనే మొదలైంది. యాంకరింగ్ చేయటం అంటే నోటికొచ్చింది మాట్లాడటం కాదు.. వచ్చిన వారితో కాస్త కనుల విందుగా అందంగా, సెక్సీగా కనిపించాలన్న కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది అనసూయనే. బుల్లితెరలో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న అనసూయ వెండితెరపై అడుగుపెట్టింది. అక్కడ సూపర్ హిట్‌ని దక్కించుకుంది. 
 
బుల్లితెరపై అందాలు ఆరబోసిన అనసూయ వెండితెరపై అందాలను ఆరబోయడానికి సై అంది. తనకు బాగా నచ్చిన, వచ్చిన గ్లామర్ యాంగిల్‌తో హిట్‌లు దక్కించుకోవడానికి సిద్ధమైంది. దానికోసం లేటెస్ట్‌గా అనసూయ ఒక హాట్ ఫోటో షూట్ తీయించుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆ ఫోటో షూట్‌లో చాలా సెక్సీగా అందాలు ఆరబోసిందట. తొడలు అంతా కనిపించే విధంగా, ఒక చొక్కా వేసుకుని ఉన్న ఫొటో కుర్రకారుని రెచ్చగొడుతోందట. 
 
షూట్‌ సమయంలో ఆ చొక్కా కూడా తీసేసినట్లుగా తెలుస్తోంది. ఇంత హాట్‌ ఫొటో షూట్‌ దేనికోసం అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి ఇలాంటి షూట్‌లకు ఓకే చెప్పడం మంచి పద్దతి కాదు అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఆ ఫొటో షూట్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ ఫోటో షూట్‌లోని ఒక ఫోటో లీక్ అవ్వడంతో ఆ ఫోటో మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన వారు మాత్రం ఈ ఫోటో షూట్ ద్వారా అనసూయ తన స్కిన్ షోకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని సెటైర్లు వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫాం హౌస్‌‌లో గోవులు కాస్తూ కనిపించిన పవన 'గోపాలుడు'