సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు.. ఫ్యామిలీ ప్రాజెక్టూ... ఇంజనీర్ త్రివిక్రమ్, పిల్లర్ పవన్ కల్యాణ్
కాటమరాయుడు చేదు అనుభవం తర్వాత పవన్ కల్యాణ్ తీస్తున్న తాజా చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. పవన్ హీరోయిజం, త్రివిక్రమ్ మాటల మంత్రజాలపు మ్యాజిక్ రెండూ కలిపి తీసిన అత్తారింటిది దారేదీ సినిమా టాలివుడ్‌కి కలెక్షన్ల పరంగా కొత్త దారి చూపించింది. అత్తారింటిక
పవన్ కల్యాణ్ సినిమాలన్నీ ప్రాజెక్టుతోనే ముడిపడి ఉంటున్నాయి. ప్రేమించి భంగపడే ప్రాజెక్టు, ప్రేమను గెల్చుకునే ప్రాజెక్టు, నవ్వులు కురిపించే ప్రాజెక్టు, కుటుంబాలను కలిపే ప్రాజెక్టు, సీమసందుల్లో పంచ్‌లు విసిరే ప్రాజెక్టు.. సాప్ట్‌వేరూ, ప్యామిలీ వేరూ రెండింటినీ ముడి వేసే ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ సినిమాలన్నీ ప్రాజెక్టులే మరి.
కాటమరాయుడు చేదు అనుభవం తర్వాత పవన్ కల్యాణ్ తీస్తున్న తాజా చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. పవన్ హీరోయిజం, త్రివిక్రమ్ మాటల మంత్రజాలపు మ్యాజిక్ రెండూ కలిపి తీసిన అత్తారింటిది దారేదీ సినిమా టాలివుడ్‌కి కలెక్షన్ల పరంగా కొత్త దారి చూపించింది. అత్తారింటికి దారేది’ తర్వాత పవన్, త్రివిక్రమ్ కలసి చేస్తున్న చిత్రమిది. అత్తారిల్లులో నదియా పవన్‌కు అత్తగా నటిస్తే... ఈ సినిమాలో ఖుష్బూ అత్త పాత్ర చేస్తున్నారు. అత్తారిల్లులో మేనత్తను తాతయ్యకు దగ్గర చేసే ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసిన హీరో పాత్రలో పవన్ కనిపించారు. ఈ సినిమాలో ఏం ప్రాజెక్ట్ టేకప్ చేస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న సినిమా మెయిన్ పాయింట్ ఏమిటంటే.. బాబు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆఫీసులో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌తో పాటు ఓ ఫ్యామిలీ ప్రాజెక్ట్‌నూ టేకప్ చేస్తాడు. బాబు మెయిన్ టార్గెట్ కూడా ఫ్యామిలీ ప్రాజెక్టే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పవన్‌కల్యాణ్, ఖుష్బూ, ఇతర ముఖ్య తారాగణంపై సాఫ్ట్‌వేర్ ఆఫీసు నేపథ్యంలో సీన్స్ తెరకెక్కిసున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మాత ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ‘దేవుడే దిగి వస్తే’, ‘ఇంజినీర్ బాబు’ టైటిల్స్ ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయని గుసగుసలు.