మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బ్రూస్ లీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని తెలిసింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలన్నీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకోవడం ద్వారా పవన్‌కు రకుల్ వద్దంటూ ఫ్యాన్స్ అంటున్నారట. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్‍తో కష్టాలను కొనితెచ్చుకున్న పవన్ కల్యాణ్ ఎస్.జె.సూర్యతో తీసే హుషారు సినిమా ద్వారానైనా మంచి పాజిటివ్ టాక్స్ వచ్చేలా చేసుకోవాలని సినీ పండితులు అంటున్నారు.
కానీ దాదాపు మెగా హీరోలందరి సినిమాలకి సైన్ చేసిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఇప్పటివరకు పవన్ సరసన నటించలేదని.. తాజా సమాచారం ప్రకారం ఆమెకు పవన్ సరసన నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసిందని తెలుస్తోంది.
గతంలో ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్‌ని తీసుకోవాలని యూనిట్ నిర్ణయించుకున్నప్పటికీ, శ్రుతిహాసన్ చేతినిండా సినిమాలతో ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందని.. అందుచేత రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రకుల్ సెంటిమెంట్ పవన్‌ను వెంటాడుతుందేమోనని పవర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.