బాహుబలి 2 రికార్డుల మోత మొదలైంది. బాహుబలి బిగినింగ్‌కు ఎండింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వేసవికి తర్వాత రాజమౌళి తన బాహుబలి టీమ్‌తో షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో బాహుబలి బిజినెస్ రాకెట్ వేగంలో దూసుకెళ్తోందని తెలిసింది. బాహుబలి2 ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్ అయింది.
బాహుబలి బిగినింగ్ రూ.500కోట్లకు పైగా రావడంతో రెండో భాగం బిజినెస్ అంతకంటే నాలుగింతలు అధికంగా ఉంటుందని తెలిసింది. ఇప్పటికే యూరప్‌లో మాత్రమే రూ.35 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ పలికిందని సమాచారం. గతంలో ఏ తెలుగు సినిమా కూడా రూ.2 కోట్లకు మించి రాబట్టని యూరప్‌లో బాహుబలికి భారీ మొత్తం పెట్టి తీసుకునేందుకు వ్యాపారవేత్తలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.