Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

Advertiesment
Ananya Nagalla

డీవీ

, శనివారం, 21 డిశెంబరు 2024 (18:32 IST)
Ananya Nagalla
ఒక సంఘటన జరిగినపుడు అందులో ఒకొక్కరి కోణం నుంచి ఒకొక్క పెర్స్ఫెక్టివ్ ఉంటుంది. ఇలా కథని తీసుకెళ్లడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌' కథ వినగానే ఓకే చెప్పాను. ఇది చాలా డిఫరెంట్ కథ. వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది అని అనన్య నాగళ్ల అన్నారు.
 
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. లాస్యారెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
ఇందులో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్‌ అని పెట్టడం జరిగింది. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది.
 
మీ పాత్ర గురించి ?
ఇందులో నా పాత్ర పేరు భ్రమరాంబ. కథలో నా రోల్ చాలా బావుంటుంది. ఇప్పటివరకూ చేయని రోల్. అలాగే ఇది ఎక్స్ ట్రార్డినరీ స్టొరీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఓ కేసు జరిగింది. ఆ కేసు తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా మలుపులతో కథనం ఎంగేజింగ్ గా ఉంటుంది.  
 
-ఇందులో రవితేజతో నటించడం మంచి ఎక్స్ పీరియన్స్, కొత్త వారిలో ఒక జీల్ వుంటుంది. తను వున్న సీన్ బెటర్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అది నాకు చాలా నచ్చింది. ఇందులో ఒక క్యుట్ లవ్ స్టొరీ వుంటుంది. థ్రిల్ సస్పెన్స్ అన్నీ వుంటాయి.
 
పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు కదా.. ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ?
- వకీల్ సాబ్ లో కోర్టు సీన్ చేస్తున్నప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీలో ఎమోషనల్ కోషేంట్ చాలా వుంది, రియల్ పెయిన్ కనిపిస్తుందని చెప్పారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది.
 
ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
-తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఆల్రెడీ చేస్తున్నాను.
 
మీ జర్నీ పట్ల హ్యాపీగా వున్నారా ?
-చాలా హ్యాపీగా వున్నాను. నాకు కంటిన్యూ గా వర్క్ వస్తోంది. రీసెంట్ గా పోట్టేల్ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత నా దగ్గరకి మంచి కథలు వచ్చాయి. ఓ రెండు సినిమాలు సైన్ చేశాను.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
-కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు త్వరలో రాబోతున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్