Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''హుషారు''గా సెట్స్‌పైకి పవన్ కల్యాణ్.. పొల్లాచ్చిలో షూటింగ్!

Advertiesment
Pawan Kalyan
, గురువారం, 2 జూన్ 2016 (20:39 IST)
'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తర్వాత పవన్‌కళ్యాణ్‌ నటించనున్న తాజా చిత్రం సెట్‌పైకి వెళ్ళనుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయిన ఈ చిత్రానికి ఎస్‌జె సూర్య దర్శకుడు. శ్రుతిహాసన్‌ జోడీగా నటించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.
 
శరత్‌మరార్‌ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. బాణీలుకూడా కొలిక్కి వచ్చాయి. ఈ నెలాఖరులో పొల్లాచ్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు సమాచారం. కోయంబత్తూరు సమీపంలోని పొల్లాచ్చి కొబ్బరి చెట్లతో కూడిన పంటపొలాల్లో ఈ సినిమా షూటింగ్ తెరకెక్కనుంది. గబ్బర్ సింగ్ తర్వాత హిట్‌కు నోచుకోలేని పవన్ కల్యాణ్.. తిరిగి ఖుషీ దర్శకుడితో జతకట్టడం ద్వారా బంపర్ హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''నూర్'' ఫస్ట్ లుక్ రిలీజ్.. జర్నలిస్టుగా సోనాక్షి సిన్హా..!