Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రారంభమైన "పింక్" రీమేక్.. పత్తాలేని పవన్ కళ్యాణ్ (video)

Advertiesment
ప్రారంభమైన
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (12:00 IST)
బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఈచిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజులు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. ఇందులో ఈ చిత్ర యూనిట్‌కు సంబంధించిన పలువురు పాల్గొన్నారు. అయితే, ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్రను పోషించనున్నట్టు వార్తలు వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. పైగా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా నిర్మాతలు చేయలేదు.
 
నిజానికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో ఈ మూవీ రీమేక్‌ను తెరకెక్కింబోతున్నట్లు గతంలో ఓ అధికారిక ప్రకటన వచ్చింది. ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నారని నిర్మాతలు వెల్లడించారు. దీంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ మూవీ ద్వారా తమ అభిమాన నటుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని వారంతా భావించారు. 
 
అయితే, పవన్ మాత్రం మరోలా స్పందించారు. తన అనుమతి లేకుండా సినిమాను ప్రకటించారని, తాను సినిమాల్లో నటించకపోవచ్చని.. కానీ నిర్మాతగా మూవీలు చేస్తానని ఆయన వెల్లడించారు. దీంతో అభిమానుల్లో మళ్లీ డైలామా నెలకొంది. అసలు పవన్ ఈ రీమేక్‌లో నటిస్తాడా..? లేదా..? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌లాగే మారింది. 
 
ఇలాంటి నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సినిమాను ప్రారంభించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఓవైపు ఏపీలో పవన్ రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తుండగా, మరోవైపు ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరగడం గమనర్హం. దీంతో అసలు ఈ సినిమాలో పవన్ నటిస్తాడా..? లేదా..? అన్నది మరోసారి సస్పెన్స్‌గా మారింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసుర‌న్ రీమేక్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..?