Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20,07,899కి చేరిన పవన్ ఫాలోవర్స్ సంఖ్య.. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పిన జనసేనాని

సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాలోవర్స్‌ విషయంలో అదరగొట్టారు. ఇప్పటిదాకా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 20,07,899కి చేరుకుంది. ట్విట్ట‌ర్‌లో అత్య‌ధిక ఫా

20,07,899కి చేరిన పవన్ ఫాలోవర్స్ సంఖ్య.. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పిన జనసేనాని
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:39 IST)
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాలోవర్స్‌ విషయంలో అదరగొట్టారు. ఇప్పటిదాకా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 20,07,899కి చేరుకుంది. ట్విట్ట‌ర్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న తెలుగు హీరోల్లో ప‌వ‌న్ ఐదో స్థానంలో ఉన్నారు. మొద‌టి స్థానంలో మ‌హేష్ బాబు, రెండో స్థానంలో సిద్ధార్థ్‌, మూడో స్థానంలో రానా, నాలుగో స్థానంలో నాగార్జున ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో తన ఫాలోవర్స్ సంఖ్య 20,07,899కి చేరిన సందర్భంగా.. పవన్ కల్యాణ్ అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ''మూడేళ్ల క్రితం జ‌న‌సేన ప్ర‌యాణం మొద‌లు పెట్టిన‌పుడు... దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్య‌మే క‌వ‌చంగా.... ఒకే గొంతుక‌తో మొద‌లు పెట్టాను, నేను స్పందించిన ప్ర‌తి స‌మ‌స్య‌కి మేమున్నామంటూ ప్ర‌తిస్పందించి, ఈ రోజు ఇర‌వై ల‌క్ష‌ల దీపాల‌తో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిర‌స్సు వంచి కృత‌జ్ఞ‌త‌ల‌తో... మీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...'' అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన గంట‌లోనే ఐదు వేలకు పైగా లైకులొచ్చాయి. 2000లకు పైగా రీట్వీట్లు వ‌చ్చాయి. 
 
ఇదిలా ఉంటే ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జనసేన పార్టీ ఔత్సాహిక వేదికలు నిర్వహిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. ఈ నెల 18, 19తేదీన గుంటూరు జిల్లాలో, 20, 21న ఏలూరులో ఔత్సాహిక వేదికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్పీకర్లు, అనలిస్టులు, కంటెంట్‌ రైటర్ల కోసం గుంటూరు జిల్లా నుంచి 3786 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 4913 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఔత్సాహిక వేదికలతో ఈ ప్రక్రియ పూర్తికానుందని పవన్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమ్యూనిస్టులతో కమల్ హాసన్ దోస్తీ...