Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ గారే ఆస్తులు అమ్ముకుంటుంటే నీకేం ఇస్తారు షకలక శంకర్?

Shakalaka Shankar

ఐవీఆర్

, శుక్రవారం, 24 మే 2024 (16:31 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమానుల్లో షకలక శంకర్ ఒకరు. ఈ నటుడు తన మనసులో ఏదీ దాచిపెట్టుకోరు. ఉన్నది వున్నట్లు చక్కగా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోరు. ఇక అసలు విషయానికి వస్తే... 2019 ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం షకలక శంకర్ చాలా కష్టించి పనిచేసారు. దీనిగురించి ఆయన మాటల్లోనే..." గత ఎన్నికల్లో రూ. 3 లక్షలు నా సొంత డబ్బు ఖర్చు చేసాను. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు భోజనాలు పెట్టించాను. ఎన్నికలు ముగిసాక ఇంటికి వెళ్లాలంటే నా చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరికి నా స్నేహితుడికి ఫోన్ చేసి 1000 రూపాయలు డీజిల్ పోయించుకుని ఇంటికెళ్లా.
 
ఎన్నికల్లో మొత్తం డబ్బు ఖర్చు చేసానని నా భార్యకు చెబితే ఆమె నాతో 4 రోజులు పలకలేదు. మా మామయ్యగారు కూడా బాధపడ్డారు. ఐతే పవన్ కల్యాణ్ గారి కోసం నువ్వు ఇంత చేసావు, ఆయన నీకు కనీసం ఫోన్ అయినా చేసారా అని అడిగారు. ఆ మాటకు నావద్ద బదులు లేదు. ఎందుకంటే పవన్ గారి నుంచి ఏదో ఆశించి నేను ప్రచారం చేయలేదు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి నాయకుడికి నా వంతు సాయం చేయాలని చేసాను. మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నాను. ఐతే నా దగ్గర డబ్బులు లేవు. అదే విషయాన్ని నేరుగా చెప్పేసా. డబ్బులు ఖర్చుపెట్టుకోండి, నేను వచ్చి ప్రచారం చేస్తాను అని చెప్పా. వాళ్లు నాకు భోజనం, బస చూపించారు. ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను" అని వివరించారు.
 
షకలక కామెంట్ల పైన తలోరకంగా స్పందిస్తున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పవన్ కల్యాణ్ గారే తన ఇల్లును అమ్ముకున్నారు. పిల్లలకు దాచిపెట్టుకున్న నగదును మొత్తం ఖర్చు చేసారు. అలాంటి పరిస్థితుల్లో ఇక మీలాంటివారికి ఆయన ఏం డబ్బులిస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ నేవీ సోల్జర్ శాంతి చంద్ర నటించిన డర్టీ ఫెలో రివ్యూ