పవన్ కళ్యాణ్ ఖాతాలోకి రూ.కోట్లు.. సినిమాల ద్వారా ఎన్నికలకు నిధుల సేకరణ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి రూ.కోట్ల వచ్చి చేరనున్నాయి. నిజానికి 'సర్దార్ గబ్బర్ సింగ్' తీవ్రమైన నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'కాటమరాయుడు' మాత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి రూ.కోట్ల వచ్చి చేరనున్నాయి. నిజానికి 'సర్దార్ గబ్బర్ సింగ్' తీవ్రమైన నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'కాటమరాయుడు' మాత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి రూ.25 కోట్ల పారితోషికంతో పాటు.. నైజాం ఏరియా పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం.
'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్'కు దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'కాటమరాయుడు' సినిమాకు మాత్రం కేవలం ఆరంటే.. ఆరు నెలలే టైం తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆయా సినిమాల ద్వారా పవన్ కల్యాణ్ దాదాపు రూ.150 కోట్లు జేబులో వేసుకోబోతున్నాడట. అంటే 2019 ఎన్నికల్లోపు పవన్ చేయబోయే సినిమాలన్నిటినీ కలుపుకొంటే అంత రెమ్యునరేషన్ పవన్ జేబులోకి చేరిపోబోతోందట.
2019 ఎన్నికల లోపు పవన్ పలు చిత్రాల్లో నటించనున్నారు. వీటిలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాకు రూ.20 కోట్లు, తమిళ డైరెక్టర్ నీశన్ డైరెక్షన్‌లో ఓ సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ బానర్‌పై మరో సినిమా, బండ్లగణేశ్‌తో వాటాదారుగా మరో సినిమా పవన్ చేయబోతున్నారు.
ఆయా సినిమాలకూ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా పవన్ ఖాతాలో చేరుతున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. మొత్తంగా చూస్తే ఎలా లేదన్నా దాదాపు రూ.150 కోట్ల దాకా పవన్ అకౌంట్లో పడుతున్నాయన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. అయితే, ఈ నిధులన్నింటినీ 2019లో జరిగే ఎన్నికల ఖర్చు కోసం ఖర్చు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.