Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేనేతకు మంచి ప్రచారకర్త దొరికాడు : 'కాటమరాయుడు'పై మంత్రి కేటీఆర్ ట్వీట్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించి ఈనెల 24వ తేదీన విడుదైన చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర కేటీఆర్ తిలకించారు. అనతంరం ఆయన ఈ చిత్రంపై ట్వీట్ చేశారు. సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప

Advertiesment
చేనేతకు మంచి ప్రచారకర్త దొరికాడు : 'కాటమరాయుడు'పై మంత్రి కేటీఆర్ ట్వీట్
, ఆదివారం, 26 మార్చి 2017 (16:23 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించి ఈనెల 24వ తేదీన విడుదైన చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర కేటీఆర్ తిలకించారు. అనతంరం ఆయన ఈ చిత్రంపై ట్వీట్ చేశారు. సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం శుభపరిణామన్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటన బాగుందని కితాబునిచ్చారు. ఒక సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సినిమా ద్వారా చేనేతకు మంచి ప్రచారకర్త దొరికాడని ఆయన ట్విట్టర్ ద్వారా కొనియాడారు. 
 
కాగా, ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ‘కాటమరాయుడు’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించగా, ఈ సినిమాకు డాలీ (కిశోర్ కుమార్ పార్థసాని) దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్‌తో సెల్పీ దిగి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ హీరో శింబు ప్రేమలో పడ్డాను.. కానీ మనసులు కలిశాయనుకున్నా.. : హన్సిక