Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెడ్‌స్టార్‌‌ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మాదాల మరణవార్త విని తాను దిగ్భ్రాంతి గురైనట్టు చెప్పారు.

Advertiesment
రెడ్‌స్టార్‌‌ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
, ఆదివారం, 27 మే 2018 (13:33 IST)
రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మాదాల మరణవార్త విని తాను దిగ్భ్రాంతి గురైనట్టు చెప్పారు. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన నటుడు, దర్శకుడు, నిర్మాత మాదాల రంగారావు మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు.
 
1980లలో మాదాల రంగారావు వామపక్ష, అభ్యుదయ భావాలతో తెరకెక్కించిన చిత్రాలు నాటి సమాజంలోని పరిస్థితులకి అద్దంపట్టాయని పవన్ గుర్తు చేశారు. ముఖ్యంగా, 'యువతరం కదిలింది', 'ఎర్రమల్లెలు', 'స్వరాజ్యం', 'విప్లవ శంఖం' వంటి చిత్రాలో తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారని అన్నారు. 
 
అవినీతి, నేతల అణచివేత ధోరణులు, నిరుద్యోగ యువత ఇబ్బందుల్ని చిత్రాలుగా మలిచారన్నారు. మాదాల రంగారావు కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, రంగారావు ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మహానటి" మూవీ నుంచి తొలగించిన వీడియో