అమ్మ(రేణు)-నాన్న(పవన్) మధ్యలో ఆరాధ్య... పవర్ స్టార్ ప్రేమంటే ఇదేరా...!!
పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా రేణూ దేశాయ్ ఆయన గురించి ట్విట్టర్లో ఎలా పొగడ్తల వర్షం కురిపిస్తారో వేరే చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలన్నా అప్పటికే జరగాల్సినవి జర
పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా రేణూ దేశాయ్ ఆయన గురించి ట్విట్టర్లో ఎలా పొగడ్తల వర్షం కురిపిస్తారో వేరే చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలన్నా అప్పటికే జరగాల్సినవి జరిగిపోతాయి. ఐతే వాటిని దాటుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోవడమే ప్రధానం.
పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ బిడ్డలు అకీరా నందన్, ఆరాధ్య. వీరంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రేమ. అందుకే ఎక్కడ వున్నా పిల్లల ఆనందం కోసం ఆయన వారివద్దకు వెళ్లి వస్తుంటారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ తన మకాంను పుణెకు మార్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా మార్చి 23న పవన్ కళ్యాణ్ పుణె వెళ్లి రేణూ దేశాయ్ తో సహా కూతురు ఆరాధ్యను ఆశ్చర్యంలో ముంచెత్తాడు పవన్. ఆమె కోసం ప్రత్యేకంగా కేక్ పట్టుకుని వెళ్లి దాన్ని కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుక కేవలం అమ్మ(రేణు)-నాన్న(పవన్) ఇద్దరూ కలిసి ఆరాధ్యకు చేశారు. ఈ ఫోటోలో మరింకెవరూ లేరు మరి.