Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘బాహుబలి 2’ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ‘కబాలి’? ఏప్రిల్ 9న చెన్నైలో....

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి, ప్రభాస్ - రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్‌లు కలిసి నటించిన చిత్రం బాహుబలి 2 : ది కంక్లూజన్. ఈ చిత్రం వచ్చే నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేసమయంలో ఈనెల 2

Advertiesment
‘బాహుబలి 2’ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ‘కబాలి’? ఏప్రిల్ 9న చెన్నైలో....
, శుక్రవారం, 24 మార్చి 2017 (16:55 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి, ప్రభాస్ - రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్‌లు కలిసి నటించిన చిత్రం బాహుబలి 2 : ది కంక్లూజన్. ఈ చిత్రం వచ్చే నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేసమయంలో ఈనెల 26వ తేదీన తెలుగు ఆడియోను విడుదల చేయనున్నారు. 
 
ఆ తర్వాత ఏప్రిల్ 9వ తేదీ తమిళ ఆడియో చెన్నైలో జరుగనుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. రజనీతో పాటు చాలా మంది దక్షిణాది స్టార్‌ సెలబ్రెటీలు కూడా ఈ వేడుకకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. 
 
కాగా, ఇటీవల విడుదలైన ఆ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా... యూ ట్యూబ్ వ్యూస్‌లో ఏ భారతీయ చిత్రం అందుకోలేనంత ఎత్తుకు చేరుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణూ సమక్షంలో కుమార్తె ఆద్య బర్త్‌డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన పవన్ కళ్యాణ్ (ఫోటోలు)