#PSPK25 : విశ్వేశ్వరుని ఆశీస్సులు కోరుతున్న "అజ్ఞాతవాసి"
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఇందులో పవన్ ఇంజనీర్ స్టూడెంట్‌గా కనిపించనుండగా, ఆయన సరసన కీర్తి సురేష్, అనూ ఎమ్మాన్యుయే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఇందులో పవన్ ఇంజనీర్ స్టూడెంట్‌గా కనిపించనుండగా, ఆయన సరసన కీర్తి సురేష్, అనూ ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ సింహభాగం విదేశాల్లో జరుపుకుంది. కానీ, ఫైనల్ షెడ్యూల్ మాత్రం కాశీ బ్యాక్‌డ్రాప్ ఆధారంగా తీస్తున్నారు. చిత్రం షూటింగ్ అంతా విదేశాల్లో జరుపుకుని చివరి షెడ్యూల్ మాత్రం కాశీలో జరపడం వెనుక ఓ సెంటిమెంట్ లేకపోలేదు.
నిజానికి సినిమావాళ్ళకు సెంటిమెంట్స్ నిండుగా ఉంటాయి. అయితే ఈ సెంటిమెంట్స్ ఇప్పుడు లొకేషన్స్‌కి కూడా ఉంటున్నాయని జోస్యాలు చెబుతున్నారు సినీ ప్రియులు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఇంద్ర" అనే సినిమాను కాశీలో తెరకెక్కించగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుది.
ఆ తర్వాత చిరు తనయుడు రాంచరణ్ "నాయక్" చిత్రాన్ని తీశాడు. కుంభమేళా నేపథ్యంగా ఇక్కడ విశ్రాంతి పోరాట సన్నివేశాలను తీశారు. ఈ సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. ఇక పవన్ కూడా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో 'తీన్‌మార్' అనే చిత్రాన్ని కాశీ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కించగా, ఈ చిత్రం మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.
ఆ తర్వాత ఏ మెగా హీరో కూడా కాశీలో షూటింగ్ నిర్వహించలేదు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తన కొత్త చిత్రం అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ మాత్రం ఇక్కేడ జరుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం ఫైనల్ షెడ్యూల్ అంతా వారణాసిలోనే తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీ మంచి విజయం సాధిస్తే విశ్వేశ్వరుని ఆశీస్సులు మెగా ఫ్యామిలీకి ఉన్నాయని, వారణాసి సెంటిమెంట్ మెగా ఫ్యామిలీకి వర్కవుట్ అవుతుందని ఓ అంచనాకి రావచ్చు.